డిసెంబర్ 4 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

By Mahesh K  |  First Published Nov 9, 2023, 9:58 PM IST

డిసెంబర్ 4వ తేదీ నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 22వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగి ముగుస్తాయి. ఈ సమావేశాల్లో మహువా మోయిత్రాపై ఎథిక్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మరికొన్ని కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది.
 


న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4వ తేదీ నుంచి డిసెంబర్ 22వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర పార్లమెంటు వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం వెల్లడించారు. ఐదు అసెంబ్లీల ఎన్నికల నెలాఖరుతో ముగుస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 3వ తేదీన ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మరుసటి రోజే పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానుండటంతో పొలిటికల్ హీట్ పార్లమెంటులోనూ కనిపించే అవకాశాలు ఉన్నాయి.

శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో 15 సిట్టింగ్‌లు 19 రోజులపాటు జరగనున్నాయి. క్యాష్ ఫర్ క్వేరీ ఆరోపణల్లో ఎథిక్స్ కమిటీ మహువా మోయిత్రాను పార్లమెంటు సభ్యత్వంపై వేటు వేయాలని సిఫారసులు చేసింది. ఈ రిపోర్టును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. మోయిత్రాను బయటికి పంపే కమిటీ సిఫారసులకు ముందు ఆ కమిటీ రిపోర్టును పార్లమెంటు స్వీకరించాల్సి ఉంటుంది.

Latest Videos

Also Read: కాలేజీ ఫ్రెండ్స్‌తో భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానం.. బిడ్డను ప్రసవించిన 11 రోజులకే హతమార్చిన భర్త

ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌లను మార్చే మూడు కొత్త బిల్లులనూ ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ ఈ బిల్లులను హోం శాఖ స్టాండింగ్ కమిటీ స్వీకరించింది. దీంతో పార్లమెంటులో ఈ కీలకమైన మూడు బిల్లులను ప్రవేశపెట్టనున్నారు.

వీటితోపాటు సీఈసీ, ఈసీల నియామకానికి సంబంధించిన బిల్లులనూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లోనూ వీటిని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచించింది. కానీ, ప్రతిపక్షాల నుంచి అభ్యంతరాలు, విమర్శల నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది.

click me!