న్యూఢిల్లీలో నివాస ప్రాంతంలోకి చిరుతపులి: ఐదుగురిపై దాడి, గాయాలు

By narsimha lode  |  First Published Apr 1, 2024, 12:45 PM IST

ఢిల్లీలో నివాస ప్రాంతంలో చిరుతపులి ప్రవేశించడంతో  స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.


న్యూఢిల్లీ:వాయువ్య ఢిల్లీలోని బురారీలోని నివాస ప్రాంతంలోకి సోమవారం నాడు  చిరుతపులి  ప్రవేశించింది. దీంతో స్థానికులు భయాందోళనలకు  గురయ్యారు. చిరుతపులిని బంధించేందుకు  అధికారులు  రంగంలోకి దిగారు. ఈ సమయంలో  చిరుతపులి దాడి చేయడంతో  ఐదుగురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

చిరుతపులి  నివాస ప్రాంతంలోకి ప్రవేశించిన విషయాన్ని స్థానికులు  పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరుతపులిని బంధించేందుకు  అధికారుల బృందం  ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఓ గదిలో చిరుతను అధికారులు బంధించారు.

Latest Videos

ఉత్తర ఢిల్లీలోని  వజీరాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.జగత్ పూర్ గ్రామంలో ఇంటి టెర్రస్ పై నుండి చిరుతపులి గదిలోకి దూరింది. చిరుతపులిని బంధించేందుకు స్థానికులు  ప్రయత్నిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో  వైరల్ గా మారాయి.

ఇవాళ ఉదయం 06:20 గంటల సమయంలో చిరుతపులి వచ్చిన విషయాన్ని స్థానికులు గుర్తించారు.  ఈ విషయాన్ని  స్థానికులు  అధికారులకు సమాచారం ఇచ్చారు.  దీంతో  ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ సిబ్బంది గ్రామంలోకి  వచ్చి చిరుతపులిని బంధించేందుకు  ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు తెలిపారు.

అటవీశాఖకు చెందిన ఏడుగురు సిబ్బంది, స్థానిక పోలీసులు, ఢిల్లీ అగ్నిమాపక శాఖ బృందం సంయుక్తంగా  చిరుతను ఓ గదిలో బంధించాయని  అధికారులు ప్రకటించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని డీసీపీ ప్రకటించారు.2023  డిసెంబర్ 1న  దక్షిణ ఢిల్లీలోని  సైనిక్ ఫామ్స్ లో చిరుతపులి కనిపించింది.
 

click me!