అక్కడ పానీపూరీపై నిషేధం.. ఎందుకో తెలుసా?

By SumaBala BukkaFirst Published Jun 28, 2022, 12:09 PM IST
Highlights

పానీపూరీ అమ్మకాలపై నేపాల్ లో నిషేధం విధించారు. కలరా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

నేపాల్ : పానీపూరీ.. ఈ పేరు వింటేనే నోట్లో నీళ్లూరతాయి.. ఎన్నితిన్నా.. ఇంకా తినాలనిపిస్తుంది. ఈ టేస్ట్ ఒక్కసారి చూస్తే.. మళ్లీ మళ్లీ తినేదాకా వదలరు. దాదాపుగా అన్నిచోట్లా పానీపూరీ దొరుకుతుంది. అంతేకాదు.. ఆన్ లైన్ లో కూడా పానీపూరీ సర్వీస్ అందిస్తున్నారంటే దాని క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఇక హైదరాబాద్ లో అయితే బిర్యానీ తరువాత అంత ఫేమస్ పానీపూరీనే అని చెప్పుకోవచ్చు. ఈ పూరీకి వాడే పానీ మీద ఎన్ని రకాల నెగటివ్ కామెంట్స్ వచ్చినా.. అది అలా చూసి.. ఇలా వదిలేస్తారు. మళ్లీ పానీపూరీ బండి చూడగానే ఎగబడుతూనే ఉంటారు. అదే పానీపూరీ గొప్పదనం. అయితే ఇలాంటి పానీపూరీకి కూడా కరోనా చెక్ పెట్టింది. కరోనా సమయంలో పానీపూరీ అమ్మకాలు పూర్తిగా దెబ్బతిన్నాయనే చెప్పొచ్చు. అయితే.. ఇటీవలి కాలంలో మళ్లీ పానీపూరి అమ్మకాలు దేశవ్యాప్తంగా పుంజుకున్నాయి.

దారుణం.. బీఎస్సీ స్టూడెంట్ బ‌ట్ట‌లిప్పి చిత‌క‌బాదిన బీజేపీ నాయ‌కురాలి భ‌ర్త‌.. వీడియో వైర‌ల్

కానీ, ఒకచోట మాత్రం తాజాగా పానీపూరీ మీద నిషేధం విధించారు. అదెక్కడా అంటే కాఠ్ మండూ వ్యాలీలో. ఎందుకటా అంటే.. ఆ వ్యాలీలో ఇటీవల కలరా కేసులు పెరుగుతున్నాయట. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం ఇలా కీలక నిర్ణయం తీసుకుంది. కాఠ్ మండూ వ్యాలీలోని లలిత్ పుర్ లో 12 కేసులు వెలుగు చూడటంతో పానీపూరీ మీద నిషేధం విధించింది. పానీపూరీలలో ఉపయోగించే నీళ్లలో కలరా బ్యాక్టీరియా ఉన్నట్లు లలిత్ పూర్ మెట్రోపాలిటన్ సిటీ అధికారులు తెలిపారు. 

click me!