దారుణం : సిగరెట్ అప్పు ఇవ్వలేదని పాన్ షాప్ యజమాని హత్య.. !

Published : Jul 22, 2021, 10:59 AM IST
దారుణం : సిగరెట్ అప్పు ఇవ్వలేదని పాన్ షాప్ యజమాని హత్య.. !

సారాంశం

మంగళవారం రాత్రి ఇదే ప్రాంతానికి చెందిన అరుణ్ పాండి, కార్తీక్, జ్యోతిమణి దుకాణం వద్దకు వచ్చి సిగరెట్ ఇవ్వాలని కోరారు. కానీ, వినోద్ డబ్బిస్తేనే సిగరెట్ ఇస్తానని, అప్పు ఇచ్చేది లేదని చెప్పాడు. దీంతో ఆగ్రహించిన ముగ్గురు వ్యక్తులు వినోద్ మీద దాడి చేశారు. 

చెన్నై : తమిళనాడులో దారుణం జరిగింది. సిగరెట్ అప్పుగా ఇవ్వనన్నందుకు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సిగరెట్ అప్పు ఇచ్చేందుకు నిరాకరించిన పాన్ షాప్ యజమానికి దారుణంగా హత్య చేసిన వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.

మధురైలో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని సక్కిమంగళం సమీపంలోని సమత్తువపురం గ్రామంలో వినోద్ పాన్ షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.

మంగళవారం రాత్రి ఇదే ప్రాంతానికి చెందిన అరుణ్ పాండి, కార్తీక్, జ్యోతిమణి దుకాణం వద్దకు వచ్చి సిగరెట్ ఇవ్వాలని కోరారు. కానీ, వినోద్ డబ్బిస్తేనే సిగరెట్ ఇస్తానని, అప్పు ఇచ్చేది లేదని చెప్పాడు. దీంతో ఆగ్రహించిన ముగ్గురు వ్యక్తులు వినోద్ మీద దాడి చేశారు. 

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వినోద్ ను ఆ ప్రాంతవాసులు మదురై రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, ఆయన అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. దీనిమీద స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు. 
 
PREV
click me!

Recommended Stories

తమిళనాడు అసంబ్లీలో గందరగోళం | Udhayanidhi Stalin vs Aadhav Arjuna | CM Vijay | Asianet News Telugu
మాటలకందని విషాదం.. కోచింగ్ సెంటర్‌లో అగ్ని ప్ర‌మాదం 14 మంది మృతి, బిల్డింగ్ నుంచి దూకిన విద్యార్థులు