కోల్‌కతాలో పాకిస్థాన్ గూఢచారి అరెస్ట్, కీలక పత్రాలు స్వాధీనం

Published : Aug 27, 2023, 01:56 AM IST
కోల్‌కతాలో పాకిస్థాన్ గూఢచారి అరెస్ట్, కీలక పత్రాలు స్వాధీనం

సారాంశం

Kolkata: కోల్ క‌తాలో పాక్ గూఢచారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్ర‌మంలోనే ప‌లు కీల‌క డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అనుమానిత పాక్ గూఢచారి మొబైల్ ఫోన్ లో ఫొటోలు, వీడియోలు, ఆన్ లైన్ చాటింగ్ ల రూపంలో రహస్య సమాచారం లభించినట్లు కోల్ కతా పోలీసులు తెలిపారు.  

Suspected Pakistani spy arrested in Kolkata: కోల్ క‌తాలో పాక్ గూఢచారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్ర‌మంలోనే ప‌లు కీల‌క డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అనుమానిత పాక్ గూఢచారి మొబైల్ ఫోన్ లో ఫొటోలు, వీడియోలు, ఆన్ లైన్ చాటింగ్ ల రూపంలో రహస్య సమాచారం లభించినట్లు కోల్ కతా పోలీసులు తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. పాకిస్థాన్ గూఢచారిగా పనిచేస్తున్న 36 ఏళ్ల వ్యక్తిని కోల్ కతాలో అరెస్టు చేశామనీ, అతని వద్ద నుంచి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నామని కోల్ క‌తా సీనియర్ పోలీసు అధికారి ఒకరు శనివారం తెలిపారు. స్పై గురించి సమాచారం అందుకున్న కోల్ క‌తా పోలీసులు శుక్రవారం రాత్రి హౌరాలోని అతని నివాసం నుంచి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని కోల్ క‌తాలోని స్పెషల్ టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో గంటల తరబడి విచారించారు.

నిందితుడు బీహార్ లోని దర్భంగా జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు. అరెస్టయిన వ్యక్తి నేరుగా దేశ భద్రతకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ''అతని మొబైల్ ఫోన్ లో ఫొటోలు, వీడియోలు, ఆన్ లైన్ చాటింగ్ ల రూపంలో రహస్య సమాచారం లభించింది. వీటిని పాకిస్థాన్ కు చెందిన అనుమానిత ఇంటెలిజెన్స్ కార్యకర్తకు పంపాడు'' అని ఆ అధికారి తెలిపారు. అతని మొబైల్ పరికరాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఆ వ్యక్తి కోల్ కతాలోని ఓ కొరియర్ సర్వీస్ కంపెనీలో పనిచేస్తున్నాడనీ, గతంలో ఢిల్లీలో ఉండేవాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నిందితుడు ఢిల్లీ నుంచి మకాం మార్చిన తర్వాత గత మూడు నెలలుగా హౌరా ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఆయనను శుక్రవారం అక్కడి నుంచి తీసుకెళ్లి తమ కార్యాలయంలో విచారించామని తెలిపారు. స్థానిక కోర్టు ఆయనకు సెప్టెంబర్ 6 వరకు పోలీసు కస్టడీ విధించింది. ఐపీసీ, అధికారిక రహస్యాల చట్టంలోని పలు సెక్షన్ల కింద నిందితుడిని అరెస్టు చేశారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం