మధ్యప్రదేశ్: మొహర్రం వేడుకల్లో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు

By Siva KodatiFirst Published Aug 21, 2021, 2:17 PM IST
Highlights

మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినిలో పాకిస్థాన్ అనుకూల నినాదాలు కలకలం రేపాయి. ఖరాకువా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మొహర్రం సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో కొందరు 'పాకిస్థాన్ జిందాబాద్' అంటూ నినాదాలు చేశారు. 

మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినిలో పాకిస్థాన్ అనుకూల నినాదాలు కలకలం రేపాయి. ఖరాకువా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మొహర్రం సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో కొందరు 'పాకిస్థాన్ జిందాబాద్' అంటూ నినాదాలు చేశారు. వాస్తవానికి కరోనా నేపథ్యంలో పోలీసులు ఎలాంటి ఊరేగింపులకు అనుమతి లేదు.

కాగా, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, మొహర్రం సందర్భంగా కొందరు గర్రంపై ఊరేగింపుకు యత్నించారు. అయితే కోవిడ్ నిబంధనల కారణంతో ఊరేగింపుకు అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో, వారు పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. నినాదాలు చేసిన వారిలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారికోసం పోలీసులు గాలిస్తున్నారు
 

click me!