న్యూస్ చానెల్ హ్యాక్ చేసిన పాక్ హ్యాకింగ్ గ్రూప్.. లైవ్‌‌లో పాకిస్తాన్ జెండా ప్రసారం.. ‘ప్రవక్తను గౌరవించాలి’

Published : Jun 12, 2022, 08:11 PM IST
న్యూస్ చానెల్ హ్యాక్ చేసిన పాక్ హ్యాకింగ్ గ్రూప్.. లైవ్‌‌లో పాకిస్తాన్ జెండా ప్రసారం.. ‘ప్రవక్తను గౌరవించాలి’

సారాంశం

పాకిస్తాన్ మరోసారి దాని వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. అసోంకు చెందిన ఓ న్యూస్ చానెల్ యూట్యూబ్ అకౌంట్‌ను హ్యాక్ చేసి అందులో లైవ్ స్ట్రీమ్‌కు బదులు పాకిస్తాన జెండాను ప్రసారం చేశారు. ప్రవక్తను గౌరవించాలని టిక్కర్లు పేర్కొన్నారు. పాకిస్తాన్‌కు చెందిన రివల్యూషన్ పీకే ఈ పని చేసిందని చానెల్ వ్యవస్థాపకుడు, ఎండీ తెలిపారు.

గువహతి: భారత దేశవ్యాప్తంగా మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల విషయమై ఇప్పటికీ ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. విదేశాల్లోనూ ఈ అంశంపై నిరసనలు వచ్చాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. భారత అంబాసిడర్లకు సమన్లనూ జారీ చేశారు. ఇవన్నీ ఒక విధంగా జరుగుతుంటే.. వక్రబుద్ధిని పోనిచ్చుకోని పాకిస్తాన్ మాత్రం మరోసారి తన దారి అడ్డదారే అని రుజువు చేసుకుంది.

అసాంకు చెందిన ఓ చానెల్‌ను పాకిస్తాన్‌కు చెందిన దుండగులు హ్యాక్ చేశారు. అందులో లైవ్ ఫీడ్ ప్రసారం అవుతుండగా.. వాటి ప్లేస్‌లో పాకిస్తాన్ జెండాను కొంత సేపు చూపించారు. అంటే.. ఆ చానెల్ లైవ్‌లో పాకిస్తాన్ జెండానే ప్రసారం అయింది. అంతేకాదు, ఆ సమయంలో ప్రవక్తను గౌరవించాలి అనే పదాలు టిక్కర్లుగా స్క్రీన్‌పై కనిపించాయి.

అసోంకు చెందిన టైమ్ 8 అనే డిజిటల్ న్యూస్ నెట్‌వర్క్‌పై పాకిస్తాన్‌కు చెందిన రివల్యూషన్ పీకే అనే హ్యాకింగ్ గ్రూప్ దాడి చేసినట్టు తెలుస్తున్నది. టైమ్ 8 అనే న్యూస్ చానెల్ యూట్యూబ్ అకౌంట్‌ను వారు హ్యాక్ చేశారు. జూన్ 9వ తేదీన లైవ్ న్యూస్ స్ట్రీమ్‌ను వారు ఆటంకపరిచారు. ఈ చానెల్‌కు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సుమారు 70 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

టైమ్ 8 డిజిటల్ న్యూస్ నెట్‌వర్క్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ ఎడిటర్ ఉత్పల్ కాంత ఈ ఘటనపై మాట్లాడారు. పాకిస్తాన్‌కు చెందిన రివల్యూషన్ పీకే అనే గ్రూపు కొంతసేపు టైమ్ 8 యూట్యూబ్ చానెల్‌ను హ్యాక్ చేసిందని తెలిపారు. లైవ్ స్ట్రీమ్‌ ప్లేస్‌లో పాకిస్తాన్ జెండాను బ్రాడ్‌క్యాస్ట్ చేశారని వివరించారు. అలాగే, ప్రవక్తను గౌరవించండి అంటూ టిక్కర్లు రన్ చేశారని పేర్కొన్నారు. ఇది కచ్చితంగా సైబర్ టెర్రరిజం అని ఆయన మండిపడ్డారు. ఈ ఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయం అని పేర్కొన్నారు.

హ్యాకర్లు కేవలం వారి మతపరమైన అభిప్రాయాలు వెల్లడించాలనే కాదు.. తమ చానెల్‌, భారత దేశ ప్రతిష్టను మంటగలపాలనీ ప్రయత్నించారని ఆయన వివరించారు. హ్యాక్ చేసిన వీడియో పార్టును లీక్ చేస్తూ వారు ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో పోస్టు చేశారు. పాకిస్తాన్ ట్విట్టర్ యూజర్లు ఈ ఘటనపై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. రివల్యూషన్ పీకేను స్తుతించారని పేర్కొన్నారు. టైమ్ 8 నెట్‌వర్క్ అధికారులను అలర్ట్ చేసిందని, ఈ ఘటనపై గువహతి పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్టు వివరించారు.

PREV
click me!

Recommended Stories

Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం
PM Surya Ghar Scheme : ఇలా చేశారో విద్యుత్ ఛార్జీలుండవు.. డబ్బులు సేవ్