భారత సరిహద్దుల్లో మరోసారి పాక్ డ్రోన్ కలకలం.. బీఎస్‌ఎఫ్ సిబ్బంది కాల్పులు జరపడటంతో.. 

By Sumanth KanukulaFirst Published Feb 9, 2023, 11:05 AM IST
Highlights

భారత సరిహద్దుల్లో మరోసారి పాకిస్తాన్‌ డ్రోన్ కలకలం రేపింది. డ్రోన్ కదలికలను గుర్తించిన బీఎస్ఎఫ్ సిబ్బంది కాల్పులు జరిపారు. 

భారత సరిహద్దుల్లో మరోసారి పాకిస్తాన్‌ డ్రోన్ కలకలం రేపింది. డ్రోన్ కదలికలను గుర్తించిన బీఎస్ఎఫ్ సిబ్బంది కాల్పులు జరిపారు. వివరాలు.. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో బుధవారం రాత్రి పాకిస్థాన్ డ్రోన్ బీఎస్‌ఎఫ్ సిబ్బంది గుర్తించారు. వెంటనే బీఎస్‌ఎఫ్ సిబ్బంది కాల్పులు జరపడంతో డ్రోన్ తిరిగి పాకిస్తాన్ వైపు వెళ్లిపోయింది. అయితే ఇందుకు సంబంధించి బీఎస్‌ఎఫ్ సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. 

బుధవారం రాత్రి 9:40 గంటల సమయంలో గురుదాస్‌పూర్‌లోని అడియా సరిహద్దు ఔట్‌పోస్ట్ సమీపంలో డ్రోన్ కనిపించిందని ఒక అధికారి తెలిపారు. బీఎస్ఎఫ్ దళాలు పాకిస్థాన్ డ్రోన్‌పై 16 రౌండ్లు కాల్పులు జరిపాయని చెప్పారు. ఇల్యూమినేషన్ బాంబును కూడా ఉపయోగించాయని అధికారి తెలిపారు.

ఇదిలా ఉంటే.. బుధవారం తెల్లవారుజామున అమృత్‌సర్ సెక్టార్‌లో పాకిస్థాన్ డ్రోన్‌ను బీఎస్‌ఎఫ్ కూల్చివేసింది. ‘‘ఫిబ్రవరి 7, 8 మధ్య రాత్రి సమయంలో, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మోహరించిన బీఎస్‌ఎఫ్ దళాలు బాబాపిర్ బోర్డర్ అవుట్‌పోస్ట్ బాధ్యతాయుతమైన ప్రాంతంలో పాకిస్తాన్ వైపు నుంచి భారత భూభాగంలోకి డ్రోన్ చొరబడుతున్నట్లు గుర్తించాయి. దీంతో బీఎస్‌ఎఫ్ దళాలు డ్రోన్‌పై కాల్పులు జరిపారు. అన్ని కౌంటర్-డ్రోన్ చర్యలను మోహరించారు. ఫలితంగా  డ్రోన్ సరిహద్దు దాటి పాకిస్థాన్ భూభాగంలో పడిపోయింది’’అని బీఎస్‌ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. ఇక, ఇటీవలి కాలంలో పాకిస్తాన్ వైపు నుంచి డ్రోన్ చొరబాటు ఘటనలు పెరిగిన సంగతి తెలిసిందే. 

click me!