పాక్ చెరలో ఇండియన్ పైలట్: ఎవరీ అభినందన్

Published : Feb 27, 2019, 05:03 PM ISTUpdated : Feb 27, 2019, 05:12 PM IST
పాక్ చెరలో ఇండియన్ పైలట్: ఎవరీ అభినందన్

సారాంశం

పాక్ భూభాగంలో కూలిపోయిన మిగ్ 21 విమానం నుండి పైలట్ గల్లంతయ్యాడు. అయితే ఈ పైలట్ తమ ఆధీనంలో ఉన్నాడని పాకిస్తాన్ ప్రకటించింది. ఈ మేరకు ఓ వీడియోను కూడ పోస్ట్ చేసి ఆ తర్వాత డిలీట్ చేసింది. 


న్యూఢిల్లీ: పాక్ భూభాగంలో కూలిపోయిన మిగ్ 21 విమానం నుండి పైలట్ గల్లంతయ్యాడు. అయితే ఈ పైలట్ తమ ఆధీనంలో ఉన్నాడని పాకిస్తాన్ ప్రకటించింది. ఈ మేరకు ఓ వీడియోను కూడ పోస్ట్ చేసి ఆ తర్వాత డిలీట్ చేసింది. పైలట్ గల్లంతైన విషయాన్ని భారత్ అధికారికంగా ధృవీకరించింది. కానీ అతను ఎక్కడ ఉన్నాడనే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు

కేరళలోని తాంబరంలో ఉన్న ఐఎఎఫ్ అకాడమీలో అభినందన్ పనిచేస్తున్నాడు. అభినందన్ తండ్రి రిటైర్డ్ ఎయిర్ మార్షల్. అభినందన్ అనే ఇండియన్ ఎయిర్ వింగ్ కమాండర్ తమ బందీగా ఉన్నాడని పాక్ ఓ వీడియోను విడుదల చేసిన తర్వాత డిలీట్ చేసింది.

ఆ వీడియోలో ఉన్న వ్యక్తి తాను అభినందన్‌ అని చెప్పారు. తాను పాక్ ఆర్మీ చేతిలో బందీగా ఉన్నానా అని ప్రశ్నించాడు.కానీ అవతలి వైపు నుండి సమాధానం రాలేదు. అయితే అభినందన్ పాక్ ఆర్మీకి చిక్కినట్టు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ విషయమై ప్రభుత్వం నుండి స్పష్టత రావాల్సి ఉంది.
 

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..