రైల్వే లైన్లు, లాజిస్టికల్ చైన్‌ టార్గెట్ గా ఉగ్ర‌దాడులు.. పాక్ ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరి వీడియో కలకలం

By Mahesh Rajamoni  |  First Published Aug 28, 2024, 10:58 AM IST

threatens train derailments across India : బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుళ్ల సూత్రధారి, పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాది ఫర్హతుల్లా, అతని అల్లుడు షాహిద్ ఫైసల్ దక్షిణ భారతదేశంలో స్లీపర్ సెల్‌ల నెట్‌వర్క్‌ను స్థాపించారని నిఘా సంస్థలు గుర్తించాయి.  దేశంలోని వివిధ మౌలిక సదుపాయాల‌పై దాడులు చేయ‌డం టార్గెట్ గా పెట్టుకున్నారు.


threatens train derailments across India : మ‌రోసారి దేశంలో దాడులకు సంబంధించి ఉగ్ర‌వాదుల హెచ్చ‌రిక‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది, బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడులో ప్ర‌ధాన  సూత్ర‌ధారిగా ఉన్న ఫర్హతుల్లా ఘోరి విడుద‌ల చేసిన వీడియోలో హెచ్చ‌రిక‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. టెలిగ్రామ్‌లో విడుదల చేసిన ఆందోళ‌న‌క‌ర విడియోలో ఢిల్లీ, ముంబై సహా ప్రధాన భారతీయ నగరాల్లో పెద్ద ఎత్తున రైలు ప్ర‌మాదాలు జ‌ర‌గాల‌ని త‌న అనుచ‌రుల‌ను కోరడం కలకలం రేపుతోంది. గ‌త రెండు వారాల క్రితం విడుల‌లైన ఈ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది. ఈ వీడియో భారత గూఢచార సంస్థల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. 

ఘోరీ చర్యకు పిలుపు, భారతీయ రైల్వేలో ఇటీవలి విధ్వంసక సంఘటనల మధ్య సంభావ్య సంబంధాలపై భార‌తీయ నిఘా సంస్థ‌లు దర్యాప్తు చేస్తున్నాయి. ప్రస్తుతం భార‌త‌  మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న ఘోరి, తన అనుచరుల‌ను ఉప‌యోగించుకుని దేశంలోని వివిధ మౌలిక సదుపాయాల‌పై దాడులు చేయ‌డం టార్గెట్ గా పెట్టుకున్నారు. పాత‌కాలం ఉగ్ర‌దాడుల మాదిరిగా తుపాకుల‌ను ఉప‌యోగించ‌కుండా ఇలా దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. ఆస్తిన‌ష్టంతో పాటు పెద్ద ఎత్తున ప్రాణ‌న‌ష్టం జ‌రిగేలా ఈ త‌ర‌హా దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. ముఖ్యంగా దేశంలో ర‌వాణా వ్య‌వ‌స్థ‌పై దాడులు చేయ‌డం, రైల్వే లైన్లు, పెట్రోల్ పైప్‌లైన్‌లు, లాజిస్టికల్ చైన్‌లపై దాడులు చేయాలని ఘోరి విడుద‌ల చేసిన వీడియోలో పేర్కొన‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. 

Latest Videos

ఘోరి వీడియో నేప‌థ్యంలో భాద‌ర‌త భద్రతా ఏజెన్సీలు అప్రమత్తం అయ్యాయి. రైలు నెట్‌వర్క్‌లో ఇటీవలి అనుమానాస్పద కార్యకలాపాలను పరిశీలించడానికి దారితీసింది. ఉదాహరణకు, ఆగష్టు 23, 24 తేదీలలో వందే భారత్ రైలును పట్టాలు తప్పించే ప్రయత్నంలో అదే ప్రదేశంలో సిమెంట్ దిమ్మెలను పెట్టిన‌ట్టు నివేదిక‌లు పేర్కొన్నాయి. ఇలాంటి రైలు ప్ర‌మాదాలు, ప‌రిస్థితుల‌పై నిఘా సంస్థ‌లు ద‌ర్యాప్తు చేస్తున్నాయి. గ‌తంలో బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న జరిగిన పేలుడులో 10 మందికి పైగా గాయపడ్డారు. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మార్చి 3న కేసును చేపట్టింది. ఏప్రిల్ 12న గణనీయమైన పురోగతిని సాధించింది. ఇద్దరు కీలక అనుమానితులైన అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహా, ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్ ల‌ను అరెస్టు చేసింది. ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా ఘోరి గా నిఘా సంస్థ‌ల రిపోర్టులు పేర్కొంటున్నాయి. లోతైన విచార‌ణ‌లో ఫర్హతుల్లా ఘోరీ, అతని అల్లుడు షాహిద్ ఫైసల్ దక్షిణ భారతదేశంలో స్లీపర్ సెల్‌ల నెట్‌వర్క్‌ను స్థాపించారని తేలింది.

click me!