భారతీయులకు కేంద్రం న్యూఇయర్ గిఫ్ట్: కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌కు అనుమతి

By Siva KodatiFirst Published Jan 1, 2021, 5:43 PM IST
Highlights

కరోనా వైరస్‌కు ప్రపంచవ్యాప్తంగా పలు టీకాలు అందుబాటులోకి వస్తున్న సంగతి తెలిసిందే. బ్రిటన్‌లో ఫైజర్, యూఎస్‌లో మోడెర్నాల వ్యాక్సిన్‌లను అత్యవసర వినియోగానికి అక్కడి ప్రభుత్వాలు అనుమతి మంజూరు చేసిన సంగతి తెలిసిందే. 

తాజాగా భారత్‌లో కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోవిషీల్డ్‌ను అత్యవసరంగా వినియోగించేందుకు భారత ప్రభుత్వం అనుమతించింది. ఈ వ్యాక్సిన్‌ను ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనెకా సంస్థలు అభివృద్ధి చేశాయి.

కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను సీరం సంస్థ భారత్‌లో ఉత్పత్తి చేసింది. దేశంలో వ్యాక్సినేషన్ కోసం దాదాపు 30 కోట్ల డోసులను సిద్ధం చేసింది. అయితే ప్రస్తుతానికి 10 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను అత్యవసర వినియోగానికి వాడనుంది. 

click me!