భారత్‌లో విస్తరిస్తున్న స్ట్రెయిన్: కొత్తగా నలుగురికి నిర్థారణ, 29కి చేరిన కేసులు

By Siva KodatiFirst Published Jan 1, 2021, 3:56 PM IST
Highlights

బ్రిటన్‌లో వెలుగు చూసిన కొత్త రకం కరోనా భారత్‌లోనూ చాప కింద నీరులా విజృంభిస్తోంది. తాజాగా శుక్రవారం మరో నలుగురికి స్ట్రెయిన్ నిర్థారణ అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి దేశంలో ఇప్పటి వరకు స్ట్రెయిన్ కేసుల సంఖ్య 29కి చేరుకుంది

బ్రిటన్‌లో వెలుగు చూసిన కొత్త రకం కరోనా భారత్‌లోనూ చాప కింద నీరులా విజృంభిస్తోంది. తాజాగా శుక్రవారం మరో నలుగురికి స్ట్రెయిన్ నిర్థారణ అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి దేశంలో ఇప్పటి వరకు స్ట్రెయిన్ కేసుల సంఖ్య 29కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో కొత్తగా 20,036 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా 256 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 1,02,86,710 కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా కారణంగా దేశంలో ఇప్పటివరకు 1,48,994 మంది మరణించినట్లు బులెటిన్‌ విడుదల చేసింది. 

కాగా, కొత్త సంవత్సర వేడుకలు కరోనా వ్యాప్తికి కారణం కాకుండా చూడాలంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసిన సంగతి తెలిసిందే.

మేకిన్ ఇండియా స్ఫూర్తితో వెంటిలేటర్ల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని.. సంవత్సరం వ్యవధిలో ప్రభుత్వ ఆస్పత్రులకు 36,433 వెంటిలేటర్లు సరఫరా చేసినట్లు కేంద్రం ప్రకటించింది. కొవిడ్‌కు పూర్వం అన్ని ఆస్పత్రుల్లో 16 వేల వెంటిలేటర్లు మాత్రమే ఉన్నాయని వెల్లడించింది.

click me!