అంబానీ ఇంటి వద్ద స్కార్పియో కేసులో ట్విస్ట్: కారు ఓనర్ అనుమానాస్పద మృతి

By Siva KodatiFirst Published Mar 5, 2021, 5:35 PM IST
Highlights

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి ముందు జిలెటెన్ స్టిక్స్‌తో పార్క్ చేసిన కారు ఓనర్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. స్కార్పియో కారు యజమాని మన్సూఖ్ హీరేన్ మృతదేహాన్ని పోలీసులు థానేలో గుర్తించారు. 

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి ముందు జిలెటెన్ స్టిక్స్‌తో పార్క్ చేసిన కారు ఓనర్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. స్కార్పియో కారు యజమాని మన్సూఖ్ హీరేన్ మృతదేహాన్ని పోలీసులు థానేలో గుర్తించారు. 

అయితే ఆయన మృతికి గల కారణాలు తెలియరాలేదు. అంబానీ ఇంటి ముందు పార్క్ చేసిన కారులో జిలెటెన్ స్టిక్స్‌తో పాటు బెదిరింపు లేఖ వుంది. ఇది దేశ రాజకీయ, కార్పోరేట్ వర్గాలను ఉలిక్కిపడేలా చేసింది. అయితే దీనిపై దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో కారు ఓనర్ అనుమానాస్పద మృతి చెందడం సంచలనంగా మారింది. 

కాగా, కొద్దిరోజుల క్రితం ముఖేష్ అంబానీ నివాసం ఉండే ముంబైలోని యాంటీలియా భవనం వద్ద స్కార్పియో కారు కలకలం రేపింది. పచ్చ రంగు ఉన్న ఆ కారులో జిలెటిన్ స్టిక్స్ ఉన్నాయి.

ఆ రోజు సాయంత్రం నుంచి ఆ కారును అంబానీ ఇంటి వద్ద పార్క్ చేసి ఉండడంతో అనుమానాస్పదంగా అనిపించిన సెక్యూరిటీ గార్డులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులతో పాటు బాంబు స్క్వాడ్ కూడా వెంటనే రంగంలోకి దిగి ఆకారును పరిశీలించింది.

ఆ కారులో జిలెటిన్ స్టిక్స్ గుర్తించారు. అనంతరం ఆ కారును భద్రతా బలగాలు మరో చోటకు తరలించాయి. ముంబైలో హై సెక్యూరిటీ జోన్లలో ఒకటి అయిన ఈ ప్రాంతంలో, అందులోనూ ముఖేష్ అంబానీ ఇంటి వద్ద జిలెటిన్ స్టిక్స్ ‌తో ఉన్న కారు ఉండడం పెద్ద సంచలనంగా మారింది.

click me!