
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని ప్రభుత్వం ముస్లింలకు కేటాయించిన 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేసింది. దీనితో పాటు, రాష్ట్ర రిజర్వేషన్ కోటాలో కూడా కీలక మార్పులు చేయబడ్డాయి. ఎస్సీలకు 17 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో లింగాయత్-వొక్కలిగ వర్గాలకు రిజర్వేషన్లు పెంచారు. బొమ్మయి ప్రభుత్వం రిజర్వేషన్ కోటాను 50 శాతం నుంచి 56 శాతానికి పెంచింది.
కర్ణాటక ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వాన్ని ముస్లిం వ్యతిరేకగా ప్రభుత్వమనీ ఒవైసీ అభివర్ణించారు. ముస్లింలకు 4% రిజర్వేషన్లను కర్ణాటక బీజేపీ రద్దు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆధిపత్య అగ్రవర్ణ కులాలైన వొక్కలిగ్గలు , లింగాయత్‌లలో దీనికి వసతి కల్పించబడింది. వారు ఇప్పటికే కోటా పొందుతున్నారు. ఈ నిర్ణయంపై కాంగ్రెస్, జేడీఎస్ కూడా మౌనం వహించడం ఆశ్చర్యకరం. వారి స్టాండ్ ఏమిటో వారే చెప్పాలి? అని ప్రతిపక్షాలను కూడా నిలాదీశారు.
ఆయన ట్విటర్‌లో ఇలా వ్రాస్తూ.. "కర్ణాటక బిజెపి పేద ముస్లింలకు 4% కోటాను రద్దు చేసి ఒక రోజు అయ్యింది. అది ఆధిపత్య అగ్రవర్ణ కులాలైన వొక్కలిగ్గలు & లింగాయత్‌లకు పునఃపంపిణీ చేయబడింది. వారికి ఇప్పటికే కోటా ఉంది. ముస్లింపై బీజేపీకి ద్వేషం ఉంటుందని అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ & జేడీఎస్ కూడా మౌనంగా ఉన్నాయి. వారి స్టాండ్ ఏమిటి?" అని ట్విట్ చేశారు.
బొమ్మై ప్రభుత్వం 4% ముస్లిం కోటాను రద్దు
బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని ప్రభుత్వం ముస్లింలకు 4 శాతం కోటాను రద్దు చేసి , ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అందించే 10 శాతం రిజర్వేషన్‌లో వారిని ఉంచింది. గత ఏడాది బెలగావి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా 2సి , 2డి రెండు కొత్త రిజర్వేషన్ కేటగిరీలు సృష్టించబడిన వొక్కలిగస్ (2 శాతం), లింగాయత్‌లు (2 శాతం)లకు ముస్లింల 4 శాతం కోటాను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదనంగా.. కర్ణాటక ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల (ఎస్సీలు) రిజర్వేషన్లను 15 నుండి 17 శాతానికి , షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు) 3 నుండి 7 శాతానికి పెంచింది.
మరోవైపు.. కర్ణాటక ప్రభుత్వం ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేయడాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా గట్టిగా సమర్థించారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగపరంగా చెల్లుబాటు కావని అన్నారు. ఆదివారం కర్ణాటకలోని బీదర్, రాయ్‌చూర్ జిల్లాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆదివారం బసవన్న, కెంపేగౌడ విగ్రహాన్ని హోంమంత్రి అమిత్‌షా ఆవిష్కరించారు.
ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ 4 రిజర్వేషన్లు కల్పించడం ఓటు బ్యాంకు రాజకీయమని విమర్శించారు. ‘బుజ్జగింపు రాజకీయాలు బీజేపీకి నచ్చవు. అందుకే రిజర్వేషన్లు మార్చాలని నిర్ణయించింది’ అని అమిత్‌షా విమర్శించారు. మరోవైపు.. బొమ్మై ప్రభుత్వాన్ని కొనియాడుతూ లింగాయత్, వొక్కలిగ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు చొరవ చూపడం అభినందనీయమన్నారు.
ముస్లిం కోటాను రద్దుపై కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ స్పందించారు. ‘రిజర్వేషన్లను ఆస్తుల్లాగా పంపిణీ చేయొచ్చని వారు భావిస్తున్నారు. అది ఆస్తి కాదు, మైనారిటీల హక్కు. ఓబీసీ జాబితా నుంచి ముస్లింలను తొలగించడానికి ప్రాతిపదిక ఏమీ లేదు. మేం అధికారంలోకి రాగానే రిజర్వేషన్లను పునరుద్ధరిస్తామని అన్నారు.