కరోనా వ్యాక్సిన్‌లో మధ్యప్రదేశ్ రికార్డు: ఒక్క రోజులోనే 24.20 లక్షల మందికి వ్యాక్సిన్

By narsimha lodeFirst Published Aug 26, 2021, 5:04 PM IST
Highlights

కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో  మధ్య ప్రదేశ్ రాష్ట్రం రికార్డు నెలకొల్పింది. ఒక్క రోజులోనే 24.20 లక్షల మంది వ్యాక్సిన్ వేయించుకొన్నారు. గతంలో చేసిన రికార్డును మధ్యప్రదేశ్ బ్రేక్ చేసింది. సెప్టెంబర్ 21 నాటికి అందరికీ మొదటి డోస్, డిసెంబర్ 21 లోపు అందరికీ రెండో డోసు ఇవ్వాలని లక్ష్యంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకొంది.

భోపాల్: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో  మధ్యప్రదేశ్ రాష్ట్రం సరికొత్త రికార్డు నెలకొల్పింది.  24 గంటల వ్యవధిలో 24.20 లక్షల మంది కరోనా వ్యాక్సిన్ వేసుకొన్నారు. దాదాపు లక్ష డోసులకు పైగా పంపిణీ చేశారు.మెగా వ్యాక్సిన్ డ్రైవ్ లో ఈ రికార్డు చేపట్టినట్టుగా వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జూన్ 21న  వ్యాక్సిన్ డ్రైవ్‌లో మధ్య ప్రదేశ్ ప్రభుత్వం  17.62 లక్షల మందికి వ్యాక్సిన్ అందించింది. తాగాజా బుధవారం నాడు నిర్వహించిన వ్యాక్సిన్ డ్రైవ్‌లో  24.20 లక్షల మందికి వ్యాక్సిన్ అందించారు.

గంటకు లక్ష డోసులకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.  మెగా వ్యాక్సిన్ డ్రైవ్ ను మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్  భోపాల్ లో ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం రాత్రి వరకు 4,20,97,917 మందికి వ్యాక్సిన్ అందించినట్టుగా అధికారులు తెలిపారు.సెప్టెంబర్ 21` నాటికి రాష్ట్రంలోని అర్హులైన అందరికి మొదటి డోసు, డిసెంబర్ 21లోపు రెండో డోసు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకొన్నామని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు.

click me!