వ్యాక్సినేషన్ : గంటలో లక్ష మందికి టీకాలు, మధ్యప్రదేశ్ సరికొత్త రికార్డ్....

Published : Aug 26, 2021, 04:58 PM IST
వ్యాక్సినేషన్ : గంటలో లక్ష మందికి టీకాలు, మధ్యప్రదేశ్ సరికొత్త రికార్డ్....

సారాంశం

గంటకు దాదాపు లక్ష డోసులకు పైగా పంపిణీ చేశారు. రెండు రోజుల పాటు చేపట్టిన మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా తమ ప్రభుత్వం ఈ సరికొత్త రికార్డు నెలకొల్పినట్టు వైద్యశాఖ ట్విటర్ లో వెల్లడించింది. 

భోపాల్ : కరోనా నియంత్రణకు చేపట్టిన వ్యాక్సినేషన్ లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త రికార్డును నెలకొల్పింది. 24 గంటల వ్యవధిలో 24.20 లక్షల మందికి పైగా కోవిడ్ టీకాలు పంపిణీ చేసింది. 

అంటే గంటకు దాదాపు లక్ష డోసులకు పైగా పంపిణీ చేశారు. రెండు రోజుల పాటు చేపట్టిన మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా తమ ప్రభుత్వం ఈ సరికొత్త రికార్డు నెలకొల్పినట్టు వైద్యశాఖ ట్విటర్ లో వెల్లడించింది. 

జూన్ 21న చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ లో కూడా ఒక్కరోజులో 17.62 లక్షల మంది వ్యాక్సిన్ పంపిణీ చేసి మధ్యప్రదేశ్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి రెండు రోజుల పాటు చేపట్టిన మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో తొలి రోజైన బుధవారం 24.20 లక్షలమందికి పైగా టీకాను పంపిణీ చేసినట్టు రాష్ట్ర వ్యాక్సినేషన్ అదనపు డైరెక్టర్ డాక్టర్ సంతోష్ శుక్లా వెల్లడించారు.

రెండో డోసు పెండింగ్ లో ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని ఈ క్యాంపెయిన్ నిర్వహించినట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం రాత్రి నాటికి 4,20,97,917 డోసులు పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !