2.27లక్షల మంది గర్భిణీలకు కరోనా టీకా..!

By telugu news teamFirst Published Jul 31, 2021, 3:08 PM IST
Highlights

టీకా వల్ల కలిగే ప్రయోజనాలపై వైద్య సిబ్బంది ఇచ్చిన కౌన్సిలింగ్ ఫలితంగానే ఈ టీకా పంపిణీ జరిగిందని తెలిపింది.

కరోనా మహమ్మారి తరిమికొట్టేందుకు  వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ వ్యాక్సిన్ ని ఇప్పటి వరకు 2.27లక్షల మందికి పైగా గర్భిణీలు  వేయించుకున్నారు. ఈ విషయాన్ని పార్లమెంట్ లో కేంద్రం వెల్లడించింది. టీకా వల్ల కలిగే ప్రయోజనాలపై వైద్య సిబ్బంది ఇచ్చిన కౌన్సిలింగ్ ఫలితంగానే ఈ టీకా పంపిణీ జరిగిందని తెలిపింది.

తమిళనాడులో అత్యాధికంగా 78,838 మంది గర్భిణీలు టీకా తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 34,228, ఒడిశాలో 29,821, మధ్యప్రదేశ్ లో 21, 842, కేరళలో 18,423, కర్ణాటకలో 16,673 మంది టీకా వేయించుకున్నారని పేర్కొంది. గర్భిణీలు టీకా తీసుకునేందుకు జులై 2న కేంద్రం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.

కరోనా టీకాలపై చక్కర్లు కొడుతున్న తప్పుడు సమాచారం, అపోహల్ని కేంద్రం వెంటనే పరిష్కరించిందని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. అలాగే ప్రస్తుతం దేశంలో టీకా కార్యక్రమం స్థిరమైన వేగంతో నడుస్తోందని చెప్పారు. జనవరిలో రోజుకు పంపిణీ రేటు 2.35లక్షలు ఉండగా.. జూన్ లో అది 39.89 లక్షల మందికి చేరిందన్నారు. నిన్న 52.99లక్షల మంది టీకా వేయించుకోగా..  ఇప్పటి వరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 46కోట్ల మార్కును దాటిందని కేంద్రం వెల్లడించింది. 

click me!