అక్రమాలకు చెక్: విదేశీ నిధుల (రెగ్యులేషన్) సవరణ బిల్లు 2020కి లో‌క్‌సభ ఆమోదం

Published : Sep 21, 2020, 06:37 PM IST
అక్రమాలకు చెక్: విదేశీ నిధుల (రెగ్యులేషన్) సవరణ బిల్లు 2020కి లో‌క్‌సభ ఆమోదం

సారాంశం

ఫారిన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) సవరణ బిల్లు 2020కి సోమవారం నాడు  లోక్‌సభ ఆమోదం తెలిపింది.  

న్యూఢిల్లీ:  ఫారిన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) సవరణ బిల్లు 2020కి సోమవారం నాడు  లోక్‌సభ ఆమోదం తెలిపింది.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఎన్డీఏ ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. ఇవాళ ఫారిన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) సవరణ బిల్లు 2020కి పార్లమెంట్ ఆమోదం తెలిపింది.

ఫారీన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) 2010 చట్టానికి ఈ బిల్లు సవరణలు కోరింది. విదేశాలనుండి వచ్చిన నిధులను కొన్ని సంస్థలు దుర్వినియోగం చేస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్న 19 వేల సంస్థలపై కేంద్రం చర్యలు తీసుకొంది.

2010 నుండి 2019 మధ్య కాలంలో విదేశాల నుండి నిధులు ఎక్కువయ్యాయని  కేంద్రం నివేదిక తెలుపుతోంది.విదేశాల నుండి నిధులు పొందిన సంస్థలు, వ్యక్తులు తొలుత ప్రకటించిన విధంగా నిధులను వినియోగంచలేదని తేలింది.

నిబంధనల ప్రకారంగా వ్యవహరించని ప్రభుత్వేతర సంస్థలు 19 వేల రిజిస్ట్రేషన్లను కేంద్రం రద్దు చేసింది. విదేశాల నుండి వచ్చిన సహాయాన్ని దుర్వినియోగం కాకుండా ఉండడం కోసం ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది.ప్రస్తుతం ఉన్న చట్టంలోని సెక్షన్ 3 లోని సబ్ సెక్షన్ (1)లోని క్లాజ్ (సి)ని సవరణకు పార్లమెంట్ ఇవాళ ఆమోదం తెలిపింది. 
 

PREV
click me!

Recommended Stories

UPI Update : ఫోన్ పే, గూగుల్ పే నుండి తెలియని నంబర్లకు డబ్బులు పంపితే .. ఏం చేయాలో తెలుసా?
Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?