మాస్కులు ధరించని 15 లక్షల మంది: రూ. 30 కోట్ల ఫైన్

By narsimha lodeFirst Published Feb 17, 2021, 5:09 PM IST
Highlights

కరోనా నేపథ్యంలో మాస్క్ లు ధరించని సుమారు 15 లక్షల మంది నుండి రూ. 30 కోట్లు వసూలు చేశారు అధికారులు.

ముంబై:కరోనా నేపథ్యంలో మాస్క్ లు ధరించని సుమారు 15 లక్షల మంది నుండి రూ. 30 కోట్లు వసూలు చేశారు అధికారులు.

కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ప్రతి ఒక్కరూ  మాస్క్ ను విధిగా ధరించాలని  ప్రభుత్వాలు ఆదేశించాయి. అయితే ఆదేశాలను ధిక్కరించి మాస్క్ లు ధరించని వారి నుండి భారీగా పోలీసులు జరిమానాను వసూలు చేశారు.

కరోనా సమయంలో ముంబైలో వైరస్ వ్యాప్తి కట్టడికి ముంబై కార్పోరేషన్ అధికారులు పలు కార్యక్రమాలను నిర్వహించారు. కోవిడ్ నిబంధనల్లో భాగంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని కోరుతున్నారు.

మాస్క్ లు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్న వారికి జరిమానాలు విధిస్తున్నారు. సోమవారం నాడు ఒక్కరోజునే 13 వేల మందికి జరిమానాలు విధించారు.

వీరి నుండి రూ. 26 లక్షలను వసూలు చేశారు. గత ఏడాది ఏప్రిల్ ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ వరకు  15 లక్షల మంది మాస్కులు ధరించలేదు.  దీంతో వీరి  నుండి రూ. 30 కోట్లు వసూలు చేశారు.

జుహూ, లంధేరీ వెర్సోవా వంటి ప్రాంతాల్లో కరోనా నిబంధనలను పాటించని వారి నుండి  లక్ష మందికి జరిమానాలు విధించారు.

click me!