మాజీ కేంద్రమంత్రి ఎంజే అక్బర్‌కి షాక్: ప్రియరమణికి ఊరట

By narsimha lodeFirst Published Feb 17, 2021, 3:32 PM IST
Highlights

జర్నలిస్టు ప్రియారమణికి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. మాజీ కేంద్రమంత్రి ఎంజే అక్బర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసును కోర్టు బుధవారం నాడు కొట్టేసింది.
 


న్యూఢిల్లీ:జర్నలిస్టు ప్రియారమణికి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. మాజీ కేంద్రమంత్రి ఎంజే అక్బర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసును కోర్టు బుధవారం నాడు కొట్టేసింది.

2018లో మీ టూ ఉద్యమం సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి అక్బర్ తనను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని జర్నలిస్ట్ రమణి ఆరోపించారు.మహిళలు తమ మనోవేదనలను ఏ ఫోరం ముందైనా ఉంచేందుకు భారత రాజ్యాంగం అనుమతిని ఇచ్చిందని కోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది.

మహిళలపై లైంగిక వేధింపులు తలుపులు మూసివేసిన గదిలో జరుగుతాయనే దాని విస్మరించలేమన్నారు. తనపై అక్బర్ 20 ఏళ్ల క్రితం లైంగికవేధింపులకు పాల్పడినట్టుగా ఆమె ఆరోపించారు.

జర్నలిస్టు ప్రియారమణికి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. మాజీ కేంద్రమంత్రి ఎంజే అక్బర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసును కోర్టు బుధవారం నాడు కొట్టేసింది. pic.twitter.com/M5AjcDkzEG

— Asianetnews Telugu (@AsianetNewsTL)

ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ కోసం వెళ్లిన సమయంలో తనతో హోటల్ బెడ్ రూమ్ లో అనుచితంగా వ్యవహరించాడని ఆమె తెలిపారు. ఓ పత్రికలో న్యూస్ కథనంలో ఆమె తన అభిప్రాయాలను పంచుకొన్నారు. 

 

ఆమె ఈ కథనం తర్వాత చాలా మంది మహిళలు ఇదే ఆరోపణలతో ముందుకు వచ్చారు. ఈ ఆరోపణలు చేసిన సమయంలో మోడీ నేతృత్వంలోని కేబినెట్ లో అక్బర్ సభ్యుడిగా ఉన్నారు.

రమణి ఆరోపణలపై  ఎంజే అక్బర్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసు దాఖలు చేసిన రెండు రోజుల తర్వాత 2018 అక్టోబర్ 17న మంత్రి పదవికి రాజీనామా చేశారు.తనను బెదిరించే క్రమంలోనే ఈ కేసు దాఖలు చేశారని జర్నలిస్ట్ రమణి చెప్పారు.
 

 

click me!