ఆ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకోం.. తేల్చేసిన కమల్‌హాసన్‌..

Bukka Sumabala   | Asianet News
Published : Nov 04, 2020, 10:51 AM IST
ఆ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకోం.. తేల్చేసిన కమల్‌హాసన్‌..

సారాంశం

వచ్చే యేడు జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకోబోమని కమల్ హాసన్ తేల్చేశారు.  అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలతో ఎట్టి పరిస్థితిలోనూ పొత్తు పెట్టుకోమని, తమ పార్టీ నాయకత్వంలోనే తృతీయ కూటమి ఏర్పాటవుతుందని మక్కల్‌ నీదిమయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ స్పష్టం చేశారు. 

వచ్చే యేడు జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకోబోమని కమల్ హాసన్ తేల్చేశారు.  అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలతో ఎట్టి పరిస్థితిలోనూ పొత్తు పెట్టుకోమని, తమ పార్టీ నాయకత్వంలోనే తృతీయ కూటమి ఏర్పాటవుతుందని మక్కల్‌ నీదిమయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ స్పష్టం చేశారు. 

మంగళవారం టి.నగర్‌ స్టార్‌ హోటల్‌లో పార్టీ జిల్లా శాఖల నేతలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలతో కమల్ హాసన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మక్కల్‌ నీదిమయ్యం ద్రావిడ పార్టీలతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తుపెట్టుకోదని వార్తలు వచ్చాయని.. ఆ వార్తల్లో చిన్న చిన్న సవరణ చేస్తున్నానని, రాష్ట్రంలో అన్నాడీఎంకేతో గాని, డీఎంకేతో గాని తమ పార్టీ పొత్తుపెట్టుకోదని స్పష్టం చేస్తున్నామన్నారు. 

తృతీయ కూటమి ఏర్పాటు చేసే సత్తా తమకే ఉందనే విషయాన్ని అన్ని పార్టీలు అంగీకరిస్తున్నాయని భావోద్వేగానికి లోనయ్యారు. మంగళవారం 112 నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలతో ఆయన సమావేశమయ్యారు. తిరువళ్లూరు, వేలూరు, వాణియంబాడి, తిరువణ్ణామలై, విల్లుపురం, దిండుగల్‌, రామనాథపురం, తిరుపత్తూరు, శివగంగ, కల్లకురిచ్చి, నామక్కల్‌, కరూరు, పెరంబలూరు, తంజావూరు, తిరువారూరు, కన్నియాకుమారి, తిరునల్వేలి జిల్లా శాఖ కార్యదర్శులతో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై ఆయన చర్చించారు. 

ఉదయం 11 గంటలకు 35 నియోజకవర్గాల ఇన్‌చార్జిలతోను, సాయంత్రం నాలుగు గంటలకు 34 నియోజకవర్గాల ఇన్‌చార్జిలతోను, సాయంత్రం ఆరుగంటలకు 43 నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలతో కమల్‌హాసన్‌ సమావేశమయ్యారు.

రెండోరోజు జిల్లా కార్యదర్శుల సమావేశంలో పాల్గొనేందుకు స్టార్‌హోటల్‌కు విచ్చేసిన మక్కల్‌ నీదిమయ్యం నాయకుడు కమల్‌హాసన్‌కు పార్టీ ప్రముఖులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. 

కమల్‌ కారులో హోటల్‌ ప్రాంగణానికి చేరుకోగానే పార్టీ కార్యకర్తలు కారుపై పూలవర్షం కురిపించారు. మంగళవాయిద్యాలతో ఆయనకు స్వాగతం పలికారు. ‘నమ్మవర్‌ వాళ్‌గే’, ‘వరుంగాల తమిళగమే వాళ్‌గే’ అంటూ నినాదాలు చేశారు. సమావేశంలో పాల్గొన్న జిల్లా శాఖ కార్యదర్శులు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు మాస్కులు, ఫేస్‌షీల్డులు ధరించి భౌతిక దూరం పాటించి దూరదూరంగా కూర్చున్నారు.

PREV
click me!

Recommended Stories

EPI 2024 లో అద్భుత ర్యాంకు సాధించిన యూపీ.. అసలు ఇదేమిటో తెలుసా?
Budget : ఆ ఒక్క బడ్జెట్ దేశ జాతకాన్నే మార్చేసింది.. డ్రీమ్ బడ్జెట్ అసలు కథ ఇదే !