ఆర్నబ్ గోస్వామి అరెస్ట్ ! తల్లీ, కొడుకు ఆత్మహత్య కేసు..

By AN TeluguFirst Published Nov 4, 2020, 10:15 AM IST
Highlights

రిపబ్లిక్ టీవీ అర్నాబ్ గోస్వామిని ఓ ఆత్మహత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. 2018లో జరిగిన ఓ  ఆత్మహత్య కేసులో ముంబై పోలీసులు గోస్వామి నివాసంలోకి ప్రవేశించి అతన్ని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ముంబై పోలీసులు తనపై శారీరకంగా దాడి చేశారని రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి బుధవారం ఆరోపించారు.

రిపబ్లిక్ టీవీ అర్నాబ్ గోస్వామిని ఓ ఆత్మహత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. 2018లో జరిగిన ఓ  ఆత్మహత్య కేసులో ముంబై పోలీసులు గోస్వామి నివాసంలోకి ప్రవేశించి అతన్ని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ముంబై పోలీసులు తనపై శారీరకంగా దాడి చేశారని రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి బుధవారం ఆరోపించారు.

అలీబాగ్ పోలీసుల బృందం గోస్వామిని ఆయన నివాసం నుండి అదుపులోకి తీసుకుని తీసుకెళ్లారని ఒక అధికారి తెలిపారు. రిపబ్లిక్ టీవీ గోస్వామి తమకు రావాల్సి బకాయిలు చెల్లించలేదని ఆరోపిస్తూ 2018లో ఒక ఆర్కిటెక్ట్, అతని తల్లి ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారి తెలిపారు.

ఈ మేరకు ముంబై పోలీసులు ఆర్నబ్ ఇంట్లోకి ప్రవేశించడం, అతన్ని అదుపులోకి తీసుకునే  దృశ్యాలను రిపబ్లిక్ టీవీ ఛానల్ ప్రసారం చేసింది. అయితే ఈ విజువల్స్ లో ఇది గొడవలాగా కనిపిస్తుంది.

ఆర్నబ్ గోస్వామిపై అంతకు ముందు రెండు కేసులు ఉన్నాయి. కాంగ్రెస్ నేత సోనియా గాంధీని కించపరుస్తూ టెలివిజన్ చర్చలో మాట్లాడిన కేసు ఒకటి కాగా, పాల్ఘర్ మాబ్ లిన్చింగ్ సంఘటన, బాంద్రా స్టేషన్ క్రౌడింగ్ సంఘటన నివేదికలపై వరుసగా ఎన్ఎమ్ జోషి మార్గ్ పోలీస్ స్టేషన్, పైథోనీ పోలీస్ స్టేషన్లో  గోస్వామి తన రెచ్చగొట్టే వ్యాఖ్యలకు సంబంధించి రెండు కేసులు నమోదు చేశారు.

అల్లర్లు, పరువు నష్టం, వర్గాల మధ్య శత్రుత్వం, ద్వేషం, నేరపూరిత బెదిరింపు మరియు నేరపూరిత కుట్రలకు దారితీసే రెచ్చగొట్టడం వంటి రెండు కేసులను భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) కింద నమోదు చేశారు.

అయితే జూన్ 30 న, గోస్వామిపై నమోదు చేసిన రెండు ఎఫ్ఐఆర్లపై ముంబై హైకోర్టు స్టే ఇచ్చింది. బాంబే హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణను సుప్రీంకోర్టు అక్టోబర్ 26 కి వాయిదా వేసింది, పాల్ఘర్ లిన్చింగ్ కేసుపై అర్నబ్ పై చేసిన ఆరోపణలకు సంబంధించిన దర్యాప్తును నిలిపివేసింది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో, వర్లిలోని రిపబ్లిక్ టీవీ ప్రధాన కార్యాలయం నుండి ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు గోస్వామి మరియు అతని భార్య సమ్యబ్రాతా రేపై దాడి చేశారు. 

అయితే ఇప్పుడు తాజాగా రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామిని 2018 ఆత్మాహుతి కేసులో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆర్కిటెక్ట్ అన్వే నాయక్ కుమార్తె అద్న్య నాయక్ తాజాగా ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసులో తిరిగి దర్యాప్తునకు ఆదేశించినట్లు ఈ ఏడాది మేలో మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ప్రకటించారు.

గోస్వామి ఛానల్ నుండి బకాయిలు చెల్లించలేకపోవడం వల్లే 2018 మేలో తన తండ్రి,  అమ్మమ్మలు ఆత్మహత్య చేసుకున్నారని అన్వే నాయక్ తెలిపిందని అనిల్ దేశ్ముక్ తెలిపారు.   

click me!