Rajya sabha: ఎంపీలపై సస్పెన్షన్ రద్దు చేసేందుకు వెంకయ్య నాయుడు నిరాకరణ.. విపక్షాల వాకౌట్

By team teluguFirst Published Nov 30, 2021, 1:02 PM IST
Highlights

12మంది రాజ్యసభ (Rajya sabha) సభ్యులపై సస్పెన్షన్‌ను ర్దదు చేసేందుకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) నిరాకరించారు. ఎంపీలు పశ్చాత్తాపం వ్యక్తం చేయనందున వారి సస్పెన్షన్‌ను (suspension of 12 Rajya Sabha MPs) రద్దు చేయబోమని తెలిపారు.

పార్లమెంట్ వర్షకాల సమావేశాల సందర్భంగా అనుచితంగా ప్రవర్తించిన 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు విధించిన సంగతి తెలిసిందే. అయితే వారిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే 12మంది రాజ్యసభ (Rajya sabha) సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడును (Venkaiah Naidu) విపక్షాలు కోరాయి. అయితే సస్పెన్షన్ ఎత్తివేసేందుకు వెంకయ్య నాయుడు నిరాకరించారు. ఎంపీలు పశ్చాత్తాపం వ్యక్తం చేయనందున వారి సస్పెన్షన్‌ను రద్దు చేయబోమని వెంకయ్య నాయుడు మంగళవారం తెలిపారు. ఈ నిర్ణయంపై ఆగ్రహించిన విపక్ష సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. 

మరోవైపు 12 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ (suspension of 12 Rajya Sabha MPs) చర్యలను నిరసిస్తూ లోక్‌సభ నుంచి కూడా విపక్షాలు వాకౌట్ చేశాయి. ఉభయ సభల నుంచి వాకౌట్ చేసిన ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహాం వద్ద నిరసన తెలియజేశారు.  

‘సస్పెండ్ చేయబడిన ఎంపీలు పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. ప్రతిపక్ష నేత (మల్లికార్జున్ ఖర్గే) విజ్ఞప్తిని నేను పరిగణనలోకి తీసుకోవడం లేదు. సస్పెన్షన్ రద్దు చేయబడదు. గత వర్షాకాల సమావేశాల సందర్బంగా చోటుచేసుకున్న చేదు అనుభవం ఇప్పటికీ మనలో చాలా మందిని వెంటాడుతూనే ఉంది. గత సెషన్‌లో జరిగిన ఘటనలను సభలోని ప్రముఖులు తప్పుబట్టి, ఆగ్రహం వ్యక్తం చేయడానికి ముందుకు వస్తారని నేను ఎదురుచూశారు. అలా జరిగితే సభను మరింత సముచితంగా తీసుకెళ్లడంలో నాకు హెల్ప్ అయ్యేది. కానీ దురదృష్టవశాత్తు అది జరగదు’ అని వెంకయ్య నాయుడు అన్నారు. 

Also read: MPs suspended: 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు.. గత సమావేశాల్లో అనుచిత ప్రవర్తనే కారణమని వెల్లడి..

సోమవారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి (Pralhad Joshi) మాట్లాడుతూ.. రాజ్యసభ నుంచి 12 మంది  ప్రతిపక్ష ఎంపీలను నిబంధనల ప్రకారం సస్పెండ్ చేసినట్టుగా తెలిపారు. అయితే వారు సభాపతికి క్షమాపణలు చెప్పి, సభకు క్షమాపణ చెబితే వారి సస్పెన్షన్‌ను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. అయితే విపక్షాలు మాత్రం తాము క్షమాపణ చెప్పబోమని స్పష్టం చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్దంగా రాజ్యసభ ఎంపీలను సస్పెండ్ చేశారని ఆరోపిస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తుందని.. విపక్షాల గొంతు నొక్కు ప్రయత్నం చేస్తుందని నేతలు విమర్శిస్తున్నారు.అయితే ఎంపీలను సస్పెండ్ చేసిన నేపథ్యంలో కొన్ని విపక్ష పార్టీలు.. శీతాకాల సమావేశాలను బహిష్కరించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. 

Also read: లోక్‌సభలో విపక్షాల ఆందోళన: మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా

ఇక, ఎంపీలపై సస్పెన్షన్ వేటును ఉపసంహరించాలని ఈ రోజు ఉదయం 16 ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు వెంకయ్య నాయుడును కోరారు. వెంకయ్య నాయుడిని కలిసిన వారిలో కాంగ్రెస్‌తో పాటుగా డీఎంకే, ఎన్సీపీ, శివసేన, సీపీఐ, సీపీఎం, ఆర్జేజీ, టీఆర్‌ఎస్, ఐయూఎంఎల్, ఆర్‌ఎస్పీ, ఎండీఎంకే, ఎల్‌జేడీ, ఎన్‌సీ, కేరళ కాంగ్రెస్, వీసీకే, ఆప్ సభ్యులు ఉన్నారు. 

ఇక, పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో (Parliament Monsoon Session) అనుచితంగా ప్రవర్తించారనే కారణంతో 12 మంది ప్రతిపక్ష సభ్యులను రాజ్యసభ (Rajya Sabha) నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. శీతకాల సమావేశాలు (parliament winter session 2021)  మొత్తం వారిని సస్పెండ్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. అయితే దీనిని విపక్షాలు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని విపక్షాలు మండిపడుతున్నాయి. 

click me!