మణిపూర్‌ అంశంపై ప్రతిపక్షాలది మొసలి కన్నీరు.. : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫైర్

Published : Jul 31, 2023, 04:42 PM ISTUpdated : Jul 31, 2023, 04:49 PM IST
మణిపూర్‌ అంశంపై ప్రతిపక్షాలది మొసలి కన్నీరు.. : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫైర్

సారాంశం

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను మణిపూర్ అంశం కుదిపేస్తుంది. మణిపూర్ అంశంపై ప్రధాని  మోదీ పార్లమెంట్‌లో సమగ్ర ప్రకటన చేయాలని విపక్ష కూటమి ఇండియా డిమాండ్ చేస్తుంది.

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను మణిపూర్ అంశం కుదిపేస్తుంది. మణిపూర్ అంశంపై ప్రధాని  మోదీ పార్లమెంట్‌లో సమగ్ర ప్రకటన చేయాలని విపక్ష కూటమి ఇండియా డిమాండ్ చేస్తుంది. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఉభయసభలలో వాయిదాల పర్వం కొనసాగుతుంది. అయితే తాజాగా ఈ పరిణామాలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు. మణిపూర్ అంశంపై చర్చకు దూరంగా విపక్షాలు పారిపోతున్నాయని విమర్శించారు. మణిపూర్ అంశంపై ప్రతిపక్షాలు మొసలి కన్నీరు కారుస్తున్నారని.. చర్చలో పాల్గొనేందుకు ఇష్టపడటం లేదని మండిపడ్డారు. 

‘‘మణిపూర్ అంశంపై చర్చలో పాల్గొనేందుకు విపక్షాలు ఇష్టపడడం లేదు. గత ఎనిమిది రోజులుగా మణిపూర్‌పై చర్చించాలని కోరిన విపక్షాలు ఈరోజు చర్చలో పాల్గొనలేదు. ఈరోజు ఈ అంశం పార్లమెంట్‌లో చర్చకు రాగానే విపక్షాలు చర్చకు దూరంగా పారిపోయాయి. విపక్షాల తీరు పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. వారికి(ప్రతిపక్షాలకు) మణిపూర్‌ కేవలం రాజకీయ అంశం. ప్రతిపక్షాలు మణిపూర్ సమస్యపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఈ రోజు రుజువైంది. వారు నిజంగా శ్రద్ధ వహిస్తే దానిపై చర్చించి ఉండేవారు’’ అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 

ఇక, ఈరోజు ఉదయం రాజ్యసభ ప్రారంభమైనప్పటీ  నుంచి మణిపూర్ అంశంపై 267వ నిబంధన ప్రకారం ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. అయితే ఈ క్రమంలోనే మధ్యాహ్నం 2 గంటలకు మణిపూర్ అంశంపై ప్రభుత్వం చర్చకు సిద్దంగా ఉంటుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రతిపక్షాల  ఆందోళనలతో రెండు వాయిదాల అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి సమావేశమైన సమయంలో.. రూల్ 176 ప్రకారం మణిపూర్ సమస్యపై స్వల్పకాలిక చర్చకు ప్రభుత్వం అంగీకరించిందని, చర్చను ప్రారంభించాలని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ పేర్కొన్నారు.

అయితే రూల్ 267 కింద చర్చకు ప్రతిపక్ష పార్టీల సభ్యులు పట్టుబట్టారు. అయితే తాను రూల్ 267 కింద నోటీసులను నేను అంగీకరించలేదని.. వాటిని తాను తిరస్కరించానని రాజ్యసభ చైర్మన్ తెలిపారు. ఈ  క్రమంలోనే సభలో గందరగోళం కొనసాగడంతో చైర్మన్ సభను తొలుత మధ్యాహ్నం 2.30 గంటలకు, తర్వాత 3.30 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పు లేకపోవడంతో సభను రాజ్యసభ చైర్మన్‌ మంగళవారానికి (ఆగస్టు 1) వాయిదా వేశారు. 

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !