పార్లమెంట్ మొద‌టి అంత‌స్తులో ప్ర‌తిప‌క్ష ఎంపీల నిర‌స‌న‌లు.. అదానీ వ్య‌వ‌హారంపై జేపీసీకి డిమాండ్

Google News Follow Us

సారాంశం

NEW DELHI: ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం నెలకొనడంతో ఒక రోజు వాయిదా పడిన రాజ్యసభ, లోక్ సభలు తిరిగి ప్రారంభం అయ్యాయి. అయితే, మ‌రోసారి గౌతమ్ అదానీ-హిడెన్ బర్గ్ వ్యవహారంపై జేపీసీ (జాయింట్ పార్లమెంటరీ కమిటీ) విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండగా, గత వారం లండన్ లో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని అధికార పార్టీ డిమాండ్ చేసింది. ఈ క్ర‌మంలోనే మ‌రోసారి ఉభయ సభల స‌మావేశాలు మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల వర‌కు వాయిదాప‌డ్డాయి. 
 

Parliament Budget session : అదానీ గ్రూప్-హిండెన్ బ‌ర్గ్ వ్య‌వ‌హారంపై విచార‌ణ జ‌రిపించాల్సిందేన‌నీ, దీని కోసం జేపీసీని ఏర్పాటు చేయాల‌నే విష‌యంలో ప్ర‌తిప‌క్షాలు వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ఇదే స‌మ‌యంలో లండ‌న్ లో కాంగ్రెస్ మాజీ అధ్య‌క్షుడు, వ‌య‌నాడ్ పార్ల‌మెంట్ స‌భ్యులు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌ల‌పై క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని అధికార పార్టీ బీజేపీ నాయ‌కులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ మొద‌టి అంత‌స్తులోకి చేరుకుని అదానీ వ్య‌వ‌హారంపై జేపీసీ ఏర్పాటు చేయాలంటూ బ్యాన‌ర్లు ప్ర‌ద‌ర్శించారు. ప్ర‌భుత్వ తీరుపై ఆగ్రహం వ్య‌క్తం చేస్తూ నిర‌స‌న తెలిపారు.

ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం నెలకొనడంతో ఒక రోజు వాయిదా పడిన రాజ్యసభ, లోక్ సభలు తిరిగి ప్రారంభం అయ్యాయి. అయితే, మ‌రోసారి గౌతమ్ అదానీ-హిడెన్ బర్గ్ వ్యవహారంపై జేపీసీ (జాయింట్ పార్లమెంటరీ కమిటీ) విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండగా, గత వారం లండన్ లో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని అధికార పార్టీ డిమాండ్ చేసింది. ఈ క్ర‌మంలోనే మ‌రోసారి లోక్ స‌భ స‌మావేశాలు మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల వర‌కు వాయిదాప‌డ్డాయి. రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 13న ప్రారంభమయ్యాయి. అయితే హిండెన్ బర్గ్-అదానీ వివాదంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణకు విపక్షాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి.

అదానీ గ్రూప్ వ్యవహారంపై జేపీసీ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ మొదటి అంతస్తులో ఆందోళనకు దిగారు.

 

 

ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ నాయ‌కులు అధీర్ రంజ‌న్ చౌద‌రి ప్రతిపక్ష నేతలను సీబీఐ, ఈడీ ఉచ్చులో ఇరికించేందుకు మోడీ, ఆయన ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు. "దేశం నుంచి వేల కోట్లు కొల్లగొట్టి కరీబియన్ స‌ముంద్ర తీరాల్లో సరదాగా గడుపుతున్న తీరును మనం గమనిస్తున్నాం. నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ స్వేచ్ఛగా తిరుగుతున్నారు" అని అన్నారు. పార్ల‌మెంట్ స‌మావేశాల గంద‌రగోళంపై ఆయ‌న మాట్లాడుతూ.. పార్లమెంటులో కార్యకలాపాలు నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. "ప్రభుత్వం ప్రతిపక్షాలను తన మనసులోని మాటను చెప్పనివ్వడం లేదు. సభాపతి మైక్ ను మ్యూట్ చేశారు" అని అన్నారు.