న్యూఢిల్లీలోని నోయిడాలోని ఓ సెల్ ఫోన్ కంపెనీలో పనిచేస్తున్న ఆరుగురు ఉద్యోగులకు కరోనా సోకింది. దీంతో ఈ ఫ్యాక్టరీని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టుగా కంపెనీ ప్రకటించింది.
న్యూఢిల్లీ:న్యూఢిల్లీలోని నోయిడాలోని ఓ సెల్ ఫోన్ కంపెనీలో పనిచేస్తున్న ఆరుగురు ఉద్యోగులకు కరోనా సోకింది. దీంతో ఈ ఫ్యాక్టరీని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టుగా కంపెనీ ప్రకటించింది.
ఈ కంపెనీలో సుమారు 3 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఫ్యాక్టరీకి ఎవరూ కూడ రావొద్దని కంపెనీ తన ఉద్యోగులను ఆదేశించింది. ఈ కంపెనీలో పనిచేసే ఆరుగురికి కరోనా సోకడంతో ముందు జాగ్రత్తగా కంపెనీని మూసివేసినట్టుగా కంపెనీ తెలిపింది.
also read:రాష్ట్రపతి భవన్ లో పోలీస్ అధికారికి కరోనా: పలువురు క్వారంటైన్ కు
కరోనా సోకిన ఆరుగురు ఉద్యోగులతో సన్నిహితంగా ఉన్న వారెవరనే విషయమై కూడ అధికారులు ఆరా తీస్తున్నారు. మరో వైపు కంపెనీలోని మిగిలిన ఉద్యోగులకు కూడ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. ఈ కంపెనీలోని ఇతర ఉద్యోగులకు నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది.
కేంద్ర ప్రభుత్వం మే 2వ తేదీన ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో ఈ ఫ్యాక్టరీని ఈ నెలలో తెరిచారు. 30 శాతం ఉద్యోగులతో కంపెనీ తిరిగి కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ క్రమంలోనే కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు కరోనా సోకిన విషయం పరీక్షల్లో తేలింది. దీంతో ఫ్యాక్టరీని ముందు జాగ్రత్తగా మూసివేశారు.
ఈ కంపెనీలో మొత్తం 10వేల మంది ఉద్యోగులు ఉన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో 30 శాతం ఉద్యోగులతో ఫ్యాక్టరీని ప్రారంభించాలని అనుమతి ఇచ్చింది.ఈ అనుమతి మేరకు ఫ్యాక్టరీ తిరిగి ఓపెన్ చేశారు.