
న్యూఢిల్లీ: లోక్ సభలో విపక్షాల నిరసనల మధ్య కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సోసైటీస్ (సవరణ) 2022 బిల్లు ను లోక్ సభలో ప్రవేశ పెట్టారు. మణిపూర్ అంశంపై విపక్షాలు లోక్ సభలో ఆందోళనలు కొనసాగించాయి. విపక్ష పార్టీలకు చెందిన ఎంపీల నిరసనల మధ్యే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన ప్రసంగాన్ని కొనసాగించారు.
మణిపూర్ అంశంపై విపక్షాలు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. ఈ నెల 20వ తేదీన పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.మణిపూర్ అంశంపైనే విపక్షాలు పార్లమెంట్ ఉభయ సభల్లో నిరసనలు కొనసాగిస్తున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లోక్ సభలో ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.ఇదే విషయమై పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి.
మంగళవారంనాడు సాయంత్రం ఐదు గంటల సమయంలో లోక్ సభలో హోంశాఖ మంత్రి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సోసైటీస్ బిల్లుపై ప్రసంగిస్తున్న సమయంలో విపక్షాలు తమ నిరసనను కొనసాగించాయి. విపక్ష సభ్యుల మధ్యే హోం మంత్రి అమిత్ షా తన ప్రసంగాన్ని కొనసాగించారు.