ఆపరేషన్ లోటస్.. బీజేపీ ఆధ్వర్యంలో వికృత క్రీడ: ఢిల్లీ ఉప‌ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియా

By Mahesh RajamoniFirst Published Oct 29, 2022, 3:51 PM IST
Highlights

Manish Sisodia: ఢిల్లీ ఉప ముఖ్య‌మంత్రి, ఆప్ నాయ‌కుడు మ‌నీష్ సిసోడియా కేంద్రంలోని బీజేపీపై మ‌రోసారి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. బీజేపీ ఆప‌రేష‌న్ లోట‌స్ పేరుతో డ‌ర్టీ గేమ్ న‌డిపిస్తోంద‌ని ఆరోపించారు. కొత్త ఆడియో క్లిప్ బయటకు వచ్చిందని పేర్కొంటూ.. 43 మంది ఢిల్లీ ఎమ్మెల్యేలను ఫిరాయింపుల‌కు ప్రొత్స‌హించే ప్రయత్నాలను ఈ సంభాషణలు సూచిస్తున్నాయని సిసోడియా అన్నారు.
 

Delhi: పార్టీ ఫిరాయింపుల వ్య‌వ‌హారం ఇప్పుడు దేశ రాజ‌కీయాల‌ను కుదిపేస్తున్నాయి. ప్ర‌జ‌లు ఎన్నుకున్న ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను డ‌బ్బు, అధికార ఆశ చూపి కొన్ని రాజ‌కీయ పార్టీలు ఫిరాయింపుల‌ను ప్రొత్స‌హిస్తున్నాయి. ఇటీవ‌లి కాలంలో ఈ త‌ర‌హా ఫిరాయింపులు క్ర‌మంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ ఢిల్లీ ఉప ముఖ్య‌మంత్రి, ఆప్ నాయ‌కుడు మ‌నీష్ సిసోడియా.. కేంద్రంలోని బీజేపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. బీజేపీ ఆప‌రేష‌న్ లోట‌స్ పేరుతో డ‌ర్టీ గేమ్ న‌డిపిస్తోంద‌ని ఆరోపించారు. కొత్త ఆడియో క్లిప్ బయటకు వచ్చిందని పేర్కొంటూ.. 43 మంది ఢిల్లీ ఎమ్మెల్యేలను ఫిరాయింపుల‌కు ప్రొత్స‌హించే ప్రయత్నాలను సంభాషణలు సూచిస్తున్నాయని సిసోడియా అన్నారు.

శ‌నివారం మీడియాతో మాట్లాడిన మ‌నీష్ సిసోడియా.. దేశంలో బీజేపీ ఆధ్యర్యంలో ఆపరేషన్ లోటస్ పేరుతో వికృత క్రీడా నడుస్తోందని మండిప‌డ్డారు. ప్రజల ఓట్లతో గెలిచిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కోనుగోలు చేసి ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల్లో ఫిరాయింపుల‌తో ఏర్ప‌డిన ప్ర‌భ‌త్వాల‌ను గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఇదివ‌ర‌కు వెలుగుచూసిన ఆప్ ఎమ్మెల్యేక కొనుగోలు వ్య‌వ‌హారం, తాజాగా తెలంగాణ రాజ‌కీయాల‌ను కుదిపేస్తున్న మొయినాబాద్‌ ఫామ్ హౌజ్ ఘ‌ట‌న‌తో బీజేపీకి సంబంధాలు ఉన్నాయ‌ని ఆయ‌న ఆరోపించారు. హైద‌రాబాద్ లో లో బీజేపీ కోసం ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే దళారి వ్యవహారం వెలుగులోకి వచ్చింద‌ని పేర్కొన్న ఆయ‌న‌.. రూ.100 కోట్ల రూపాయలతో ముగ్గురు దళారులు రెడ్ హ్యాండెడ్ గా దొరికార‌ని చెప్పారు. అపరేషన్ లోటస్ పేరుతో ముగ్గురు దళారులు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాలు చేశార‌ని అన్నారు. 

పట్టుబడిన ముగ్గురికి బీజేపీ జాతీయ నేతలతో సంబంధాలు  ఉన్నాయ‌ని మ‌నీష్ సిసోడియా ఆరోపించారు. ఎమ్మెల్యేల‌కు డ‌బ్బుల ఆశ చూపి ఫిరాయింపుల‌కు ప్రొత్స‌హిస్తూ.. వీళ్లు మాట్లాడిన ఆడియో టేపులు కూడా వెలుగులోకి వచ్చాయ‌ని అన్నారు. "ఎమ్మెలందరిని తీసుకురండి... డబ్బులు, సెక్కూరిటీ, పదవులు ఇస్తామని ఆఫర్ చేశారు. సీబీఐ, ఈడీకి భయపడకండి మాదగ్గర ఉంటే ఏ భయం ఉండదని హామీ ఇస్తున్నారు. మేము ఢిల్లీలో కూడా అక్కడి ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేస్తున్నాం.." అని ఆపరేషన్ లోటస్ వ్యక్తులు చెబుతున్నారని పేర్కొన్నారు. ఢిల్లీలో కూడా 43 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త వెలుగులోకి వచ్చిన ఆడియోలో ఇందుకు సంబంధించిన డబ్బులు కూడా సిద్ధం అయ్యాయని చెప్పిన‌ట్టు తెలిపారు. ఆడియోలో బీఎల్ సంతోష్, అమిత్ షా పేరు కూడా చెబుతున్నార‌నీ, అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నార‌ని ఆరోపించారు. 

"43 మంది ఎమ్మెల్యేలను కొనేందుకు రూ.1075 కోట్లు ఎక్కడివి? ఆయ‌న ప్ర‌శ్నించారు. అసలు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఈ సొమ్ము ఎవ‌రిదీ? అమిత్ షా వా? లేక బీఎల్ సంతోష్ వా... ఎవరివి? కేంద్ర హోంశాఖ మంత్రి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారా?"అని మ‌నీష్ సిసోడియా ప్ర‌శ్న‌లు సంధించారు.  ఢిల్లీ, పంజాబ్, తెలంగాణ ఇలా 8 రాష్ట్రాల్లో ఈ ప్రయత్నాలు చేస్తున్నార‌నీ, దేశంలో ఇది త్రీవతరమైన సమస్య అని పేర్కొన్న సిసోడియా.. కేంద్ర హోంశాఖ మంత్రిని తప్పించాల్సిన అవసరముంద‌ని వ్యాఖ్యానించారు.

click me!