బాయ్‌ఫ్రెండ్ కలువలేదని మందు తాగిన మైనర్ బాలిక ఆత్మహత్య.. మరో ఇద్దరు బాలికలు కూడా..

Published : Oct 29, 2022, 03:26 PM ISTUpdated : Nov 03, 2022, 02:14 PM IST
బాయ్‌ఫ్రెండ్ కలువలేదని మందు తాగిన మైనర్ బాలిక ఆత్మహత్య.. మరో ఇద్దరు బాలికలు కూడా..

సారాంశం

మధ్యప్రదేశ్‌లో ఓ బాలిక తన బాయ్ ఫ్రెండ్ కలవడానికి రాలేదని మనస్తాపం చెందిన విషం తాగింది. ఆమె వెంటే ఉన్న మరో ఇద్దరు బాలికలూ విషం తాగారు. అందులో ఇద్దరు మరణించగా.. ఒకరు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.  

ఇండోర్: మధ్యప్రదేశ్‌లో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. జీవితంపై ఒక అవగాహన రాకముందే ప్రేమ అంటూ ఓ చిన్నారి ప్రాణాలు తీసుకుంది. బాయ్ ఫ్రెండ్ తనను కలవడానికి రాలేదని మనస్తాపం చెంది అక్కడే పాయిజన్ కొనుక్కుని తాగేసింది. ఆమె వెంటే వెళ్లిన మరో చిన్నారి కూడా తమ ఇంట్లో సమస్యలు ఉన్నాయని పేర్కొంటూ అదే పాయిజన్ తాగింది. వారిద్దరూ క్లోజ్ ఫ్రెండ్ కావడం మూలంగా మరో చిన్నారి కూడా విషం తీసుకుంది. ఇందులో ఇద్దరు మరణించగా.. చివరగా తీసుకున్న మైనర్ బాలిక ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నది.

ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. శుక్రవారం క్లాస్ ఎగ్గొట్టి మరీ బాయ్ ఫ్రెండ్ కోసం 100 కిలోమీటర్లు బస్సులో వెళ్లారు. అంత దూరం వెళ్లిన బాయ్ ఫ్రెండ్ ఆమెను పట్టించుకోలేదు. కలవడానికీ రాలేదు. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది.

సెహోర్ జిల్లాకు చెందిన ఒకే తరగతి చదువుకునే ముగ్గురు బాలికలు క్లోజ్ ఫ్రెండ్స్. అందులో ఒక బాలిక బాయ్‌ఫ్రెండ్ ఇండోర్‌లో ఉంటారు. కొన్నాళ్లుగా తాను ఫోన్ చేసినా ఆ బాయ్ ఫ్రెండ్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇలా ఫోన్లు చేసి ఒక రోజు నేరుగా ఇండోర్‌కు వెళ్లి ఆ బాలుడిని కలువాలని నిర్ణయించుకుంది. ఆమె వెంటే ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కూడా వెళ్లడానికి సిద్ధం అయ్యారు. శుక్రవారం ఉదయం వారు ఇంటి నుంచి బయల్దేరి అష్టటౌన్‌లోని స్కూల్‌కు వెళ్లకుండా.. క్లాసు బంక్ కొట్టి బస్సు ఎక్కారు. సుమారు 100 కిలోమీటర్ల దూరంలోని ఇండోర్‌కు బయల్దేరి వెళ్లారు.

Also Read: రాజస్తాన్‌లో అప్పులు చెల్లించలేని వారి మైనర్ కూతుళ్ల వేలం.. మహిళా కమిషన్ల ఆగ్రహం.. సీఎం గెహ్లాట్ ఏమన్నారంటే?

అష్టా టౌన్‌లోనే ఆ ముగ్గురు ఒక షాపులో పాయిజన్ కొనుక్కున్నారు. ఇండోర్‌కు వెళ్లిన తర్వాత ఓ పార్కులో వెయిట్ చేశారు. అందులో ఒకరు ఆ అబ్బాయిని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించింది. కానీ, ఆ అబ్బాయి వారిని కలవడానికి రాలేదు. దీంతో ఆ బాలిక పాయిజన్ తాగేసింది. 

ఆ వెంటనే మరో బాలిక విషం తీసుకుంది. తనకు ఇంట్లో సమస్యలు ఉన్నాయని పేర్కొని విషం తాగినట్టు మూడో బాలికకు తెలిపింది. మూడో బాలిక కూడా తన ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ విషం తీసుకోవడం చూసి తాను కూడా స్వీకరించింది. అయితే, చివరి అమ్మాయి మాత్రం ప్రాణాలతో కనిపించింది.

ఆ ముగ్గురు బాలికలను చూసి స్థానికులు వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. అక్కడి నుంచి ఎం వై హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అయితే, ఇద్దరు బాలికలు మరణించారని వైద్యులు చెప్పారు. మరొక బాలిక మాత్రం ప్రస్తుతం చికిత్స పొందుతున్నది. ఆమె చెప్పిన వివరాల ఆధారంగానే పోలీసులు ఈ మేరకు వివరించారు. వారి దగ్గర నుంచి ఎలాంటి సూసైడ్ నోట్ తమకు దొరకలేదని తెలిపారు. అందుకే ప్రాణాలతో ఉన్న ఆ బాలిక చెప్పే విషయాలనే తాము దర్యాప్తునకు ఆధారంగా తీసుకుంటున్నట్టు వివరించారు. బాలికల తల్లిదండ్రులు ఇండోర్‌కు వెళ్లారు. వారి స్టేట్‌మెంట్లు తీసుకోబోతున్నట్టు పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu