సైబర్ నేర‌గాళ్ల‌పై సీబీఐ కొరడా.. ‘ఆపరేషన్ చక్ర’ పేరుతో.. దేశ‌వ్యాప్తంగా 105 చోట్ల దాడులు!

By Rajesh KarampooriFirst Published Oct 5, 2022, 12:17 AM IST
Highlights

సైబర్ క్రిమినల్స్ పై ఉక్కుపాదం మోపే దిశగా సీబీఐ 'ఆపరేషన్ చక్ర' అని పేరుతో దాడులు నిర్వ‌హిస్తోంది. దేశ వ్యాప్తంగా 105 చోట్ల దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఏకంగా రూ.1.5 కోట్ల నగదు, 1.5 కేజీల బంగారం స్వాధీనం చేసుకుంది.

సైబర్ నేరగాళ్లపై సీబీఐ కొరడా ఝుళిపించింది. వారిపై ఉక్కుపాదం మోపే దిశ‌గా దేశవ్యాప్తంగా దాడులు నిర్వ‌హిస్తోంది. రాష్ట్ర పోలీసుల సహకారంతో  దేశ వ్యాప్తంగా 105 చోట్ల దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఏకంగా రూ.1.5 కోట్ల నగదు, 1.5 కేజీల బంగారం స్వాధీనం చేసుకుంది 

'ఆపరేషన్ చక్ర' అని పేరుతో మంగళవారం (అక్టోబర్ 4) దేశవ్యాప్తంగా సీబీఐ దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా 105 చోట్ల దాడులు నిర్వహించారు. రాష్ట్ర పోలీసుల సహకారంతో ఢిల్లీలో 5 చోట్ల సీబీఐ దాడులు నిర్వహించింది.  దీంతో పాటు అండమాన్, పంజాబ్, చండీగఢ్, రాజస్థాన్‌లో కూడా దాడులు నిర్వహించింది.  US ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI), ఇంటర్‌పోల్, రాయల్ కెనడియన్ మౌంటైన్ పోలీస్, ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులు ఇచ్చిన సమాచారంతోనే ఈ దాడులు జరిపినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.
  
16 మంది నిందితులను అరెస్టు  

సిబిఐ బృందం దేశవ్యాప్తంగా 87 చోట్ల దాడులు చేయగా, రాష్ట్ర పోలీసులు ఇతర చోట్ల సోదాలు నిర్వహించారు. ఇందులో 300 మందికి పైగా అనుమానితులను విచారిస్తున్నారు. వీరిలో 16 మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ చర్యపై అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బిఐ)కి సిబిఐ సమాచారం అందించినట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం అండమాన్ నికోబార్ దీవుల్లో నాలుగు, ఢిల్లీలో ఐదు, చండీగఢ్‌లో మూడు, పంజాబ్, కర్ణాటక, అసోంలో రెండేసి చోట్ల సోదాలు జరిగాయి. దీంతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఈ ప్రచారం జోరుగా సాగుతోంది.

నకిలీ కాల్ సెంటర్ గుట్టు రట్టు  

పూణె, అహ్మదాబాద్‌లలో అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకున్న రెండు నకిలీ కాల్ సెంటర్‌లను గుర్తించారు.  రాజస్థాన్‌లోని ఓ ప్రదేశంలో సీబీఐ సోదాలు నిర్వహించి రూ.1.8 కోట్ల నగదు, కిలోన్నర బంగారం స్వాధీనం చేసుకుంది.
 

click me!