రంజాన్ వేళ.. వెల్లివిరిసిన మత సామరస్యం.. ముస్లిం దివ్యాంగుడికి అన్నం తినిపించిన హిందూ యువకుడు.. వీడియో వైరల్..

Published : Apr 13, 2023, 02:46 PM ISTUpdated : Apr 13, 2023, 02:53 PM IST
రంజాన్ వేళ.. వెల్లివిరిసిన మత సామరస్యం.. ముస్లిం దివ్యాంగుడికి అన్నం తినిపించిన హిందూ యువకుడు.. వీడియో వైరల్..

సారాంశం

అసోంలోని గౌహతి మెడికల్ కాలేజీ ఆవరణలో మానవీయ, భావోద్వేగ ఘటన వెలుగులోకి వచ్చింది. హిందూ యువకుడు ఓ దివ్యాండికి చేతులతో అన్నం తినిపించారు.  ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఒక్కపూట అన్నం కోసం ఎదురు చూడటం.. జానెడంత ఊపిరికోసం చేయిచాచడం.. కడుపు కాలి కాలి ఆకలితో పడుకోవడం. ఇది మన దేశంలో బిచ్చగాళ్ల పరిస్థితి. వారి పరిస్థితి ఎప్పుడూ దైన్యమే. పుట్టుకతోనే ఎవరూ బిచ్చగాళ్లు కాదు.. కానీ, పరిస్థితులే అలా మారుస్తాయి. వాళ్లు ఏళ్ల తరబడి దేవాలయాల మెట్లపై పడిగాపులు గాస్తున్నా.. వారిని ఏ దేవుడూ పట్టించుకోడు. పాలకులు కూడా వారిని  దేవుళ్లకే వదిలేశారు. కడుపు కాలుతున్న వేళ పట్టెడు అన్నం పెట్టి ఆకలి తీర్చేవాడే వారికి నిజమైన దేవుడు. ఆ సమయంలో వారి సంతోషానికి అవధులుండవ్.. అలాంటి సందర్భానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 
  
పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా గౌహతి మెడికల్ కాలేజీలో ఒక యువకుడు..ఆకలితో అలామటిస్తోన్న ఓ వికలాంగుడికి తన చేతితో ఆహారాన్ని తినిపించాడు. ఆ వికలాంగుడి కడుపు నింపాడు. మానవత్వాన్ని తట్టిలేపుతున్న అపూర్వ దృశ్యాన్ని కొందరూ తమ సెల్ ఫోన్లో చిత్రీకరించి.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు.  

వివరాలోకెళ్తే.. గౌహతి మెడికల్ కాలేజీ ప్రాంగణంలో సుల్తాన్ అనే వ్యక్తికి శారీరక వైకల్యంతో బాధపడుతున్నాడు. పైగా ఆనారోగ్యం. సెహ్రీ సమయంలో ఆహారం తినడానికి ఇబ్బంది పడుతున్న సుల్తాన్ ను జింటూ డేకా అనే హిందూ యువకుడు గమనించాడు. సుల్తాన్ వద్దకు చేరుకుని ఆహారాన్ని అందించాడు. అయితే.. ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో ఆహారాన్ని తీసుకోలేక పోతున్నాడు. దీంతో జింటూ అనే యువకుడు తన చేతులతో ఆహారం తినడం ప్రారంభించాడు. ఈ మానవీయ, భావోద్వేగ దృశ్యాన్ని చూసిన ఒక వ్యక్తి దాని వీడియోను రికార్డ్ చేశాడు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జింటూ అనే యువకుడిపై  నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

మీడియా కథనాల ప్రకారం.. జింటు అస్సాం లోని రెయిన్‌డ్రాప్ ఇనిషియేటివ్ కోసం పని చేస్తాడు . రంజాన్ సందర్భంగా మెడికల్ కాలేజీలో రోగుల బంధువులకు ఉచితంగా సెహ్రీని అందజేస్తున్నాడు. ఈ ఘటనపై రెయిన్‌డ్రాప్స్ ఇనిషియేటివ్ అస్సాం ఆఫీస్ బేరర్ అబిద్ ఆజాద్ మాట్లాడుతూ.. "ఇది మాకు ప్రత్యేకమైన రోజుగా మారింది. మా సహోద్యోగి జింటూ డేకా ఒక వికలాంగుడికి తన చేతులతో అన్నం తినిపించిన తీరు భావోద్వేగానికి గురి చేసింది. ఇది సోదరభావానికి ప్రతీక.  ఈ అద్భుతమైన దృశ్యం మా ఆహార పంపిణీ సైట్‌లో కనిపించింది. ఇది మేము చేస్తున్నది ప్రజలకు ఆనందాన్ని పంచడమే.. ఆ పనితో నేరవేరిందని పేర్కొన్నారు.

 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్