కరోనా భయం.. ఆన్ లైన్ లో ఫుడ్ మాకొద్దు బాబోయ్..!

By telugu news team  |  First Published Mar 12, 2020, 10:50 AM IST

వినియోగదారులు గత కొద్దిరోజులుగా ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయడాన్ని పూర్తిగా తగ్గించేశారు. అదేవిధంగా హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి నేరుగా ఫుడ్ ఆర్డర్ చేసుకునేవారు కూడా తగ్గిపోవడం గమనార్హం. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఇప్పుడు ఈ పరిస్థితి కనపడుతోందని చెబుతుండటం గమనార్హం.



ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ కరోనా వైరస్ కారణంగా ప్రజలు ప్రతి విషయంలో భయపడుతున్నారు. సాధారణ తుమ్ములు, దగ్గులకు కూడా భయపడిపోతున్నారు. ఎక్కడ కరోనా సోకుతుందా అని వణికిపోతున్నారు. అయితే.. ఇప్పుడు ఈ కరోనా ప్రభావం ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ లపై కూడా పడటం గమనార్హం.

వినియోగదారులు గత కొద్దిరోజులుగా ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయడాన్ని పూర్తిగా తగ్గించేశారు. అదేవిధంగా హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి నేరుగా ఫుడ్ ఆర్డర్ చేసుకునేవారు కూడా తగ్గిపోవడం గమనార్హం. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఇప్పుడు ఈ పరిస్థితి కనపడుతోందని చెబుతుండటం గమనార్హం.

Latest Videos

Also Read కర్ణాటకలో కరోనా అనుమానితుడు మృతి: ఇంకా రాని రిపోర్టులు...

యూపీలోని బెనారస్‌లో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంబంధిత రెండు కంపెనీల్లో 250కి మించి సిబ్బంది పనిచేస్తున్నారు. బెనారస్ పర్యాటక ప్రాంతం కావడంతో విదేశీయులకు కూడా ఇక్కడికి అత్యధికంగా వస్తుంటారు. ఈ నేపధ్యంలో ఫుడ్ ఆర్డర్లు ఎక్కువగానే జరిగేవి. అయితే కరోనా వైరస్ భయాల నేపధ్యంలో గణనీయంగా ఫుడ్ ఆర్డర్లు తగ్గిపోయాయి.

 సిగరె‌లోని ఒక రెస్టారెంట్ నిర్వాహకుడు అమిత్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం వినియోగదారులు ఫుడ్ ఆర్డర్లు తగ్గించారని, పరిశుభ్రతా చర్యలు అమితంగా పాటిస్తున్నారన్నారు. అలాగే పర్యాటకులలో కరోనా భయాలు నెలకొన్నాయన్నారు. చైనీస్ ఫుడ్ వైపు ఎవరూ చూడటం లేదన్నారు. 

మొత్తంగా చూసుకుంటే 70 శాతం మేరకు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ తగ్గిందని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఫుడ్ డెలివరీ కంపెనీలు తమ సిబ్బంది మాస్క్ లు ధరించి ఫుడ్ ప్రిపేర్ చేసే విధానాలను వినియోగదారులకు వీడియోల ద్వారా తెలియజేస్తున్నారు. ఈ విధంగానైనా ఫుడ్ ఆర్డర్లను దక్కించుకోవచ్చని ఆయా కంపెనీలు భావిస్తున్నాయి.

click me!