పెరిగిన రేటు... రూ.8లక్షల విలువచేసే ఉల్లి చోరీ

By telugu teamFirst Published Sep 24, 2019, 1:29 PM IST
Highlights

గోడౌన్ లో ఉన్న ఉల్లిని రెండు రోజుల క్రితం చోరీ చేసినట్లు స్థానిక  మీడియా తెలిపింది.  ప్రస్తుతం దేశంలో యాపిల్ కన్నా కూడా ఉల్లే ధర ఎక్కువ పలుకుతోంది. అందుకే... దొంగల ముఠా దీనిని క్యాష్ చేసుకోవాలని అనుకున్నారు. గోడౌన్ లపై కన్నేసి ఉల్లిని కాజేశారు.

ప్రస్తుతం దేశంలో ఉల్లి ధర బాగా పెరిగింది. కేజీ ఉల్లి ధర దాదాపు రూ.80 పలుకుతోంది. దీంతో... దొంగల కన్ను ఇప్పుడు ఉల్లిపై పడింది. రేటు అమాంతం పెరగడంతో... ఉల్లి దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో బిహార్ రాష్ట్రం పట్నాలో దాదాపు రూ.8లక్షల విలువచేసే ఉల్లిని చోరీ చేశారు.

గోడౌన్ లో ఉన్న ఉల్లిని రెండు రోజుల క్రితం చోరీ చేసినట్లు స్థానిక  మీడియా తెలిపింది.  ప్రస్తుతం దేశంలో యాపిల్ కన్నా కూడా ఉల్లే ధర ఎక్కువ పలుకుతోంది. అందుకే... దొంగల ముఠా దీనిని క్యాష్ చేసుకోవాలని అనుకున్నారు. గోడౌన్ లపై కన్నేసి ఉల్లిని కాజేశారు.

కాగా... ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. దొంగతనం జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్న వీడియో ఫుటేజీని కూడా పరిశీలించినట్లు పోలీసులు చెబుతున్నారు. కాగా... ఉల్లిని పోగొట్టుకున్న వ్యాపారి ధీరజ్ కుమార్ మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

ఉల్లిని దొంగతనం చేస్తారని తాను ఎప్పుడూ ఊహించలేదని వ్యాపారి ధీరజ్ కుమార్ పేర్కొన్నారు. మొత్త 328 బ్యాగుల ఉల్లి చోరీకి గురైందని అతను చెప్పారు. ప్రస్తుతం తమ రాష్ట్రంలో ఉల్లి ధర కేజీ రూ.50 ఉందని అతను చెబుతున్నారు. నా ఉల్లి దొంగతనంతో... ఇతర వ్యాపారుల్లో కూడా కంగారు మొదలైందని అతను చెప్పడం విశేషం. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఈ సందర్భంగా ఆయన వివరించారు. 
 
click me!