బాలికపై సామూహిక అత్యాచారం..చితక బాదిన గ్రామస్థులు

Published : Sep 24, 2019, 12:16 PM IST
బాలికపై  సామూహిక అత్యాచారం..చితక బాదిన గ్రామస్థులు

సారాంశం

కౌషంబి ప్రాంతానికి చెందిన 16ఏళ్ల బాలిక.. పశుగ్రాసం కోసం పక్క గ్రామానికి వెళ్లింది. కాగా... అక్కడ ఆమెపై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. బాలికపై దాడి చేసి.. ఎవరూ లేని ప్రాంతానికి లాక్కొని వచ్చారు. అనంతరం బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దానినంతటినీ.. వీడియో తీశారు. ఆ వీడియోని తమ స్నేహితులకు షేర్ చేసుకున్నారు.

మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా... దాన్నంతటినీ వీడియో తీసి పైశాచిక ఆనందం పొందారు. ఆ వీడియోలను స్నేహితులతో కూడా షేర్ చేసుకున్నారు. తీరా ఆ వీడియో గ్రామస్థుల కంట పడటంతో... వారు నిందితులను చితకబాదారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కౌషంబి జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కౌషంబి ప్రాంతానికి చెందిన 16ఏళ్ల బాలిక.. పశుగ్రాసం కోసం పక్క గ్రామానికి వెళ్లింది. కాగా... అక్కడ ఆమెపై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. బాలికపై దాడి చేసి.. ఎవరూ లేని ప్రాంతానికి లాక్కొని వచ్చారు. అనంతరం బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దానినంతటినీ.. వీడియో తీశారు. ఆ వీడియోని తమ స్నేహితులకు షేర్ చేసుకున్నారు.

అటు తిరిగి.. ఇటు తిరిగి ఆ వీడియో బాలిక గ్రామస్థులకు చేరింది. వెంటనే వారు నిందితుల కోసం వేట మొదలుపెట్టారు. ముగ్గురు నిందితుల్లో నజీమ్ అనే యువకుడు దొరకగా... వాడిని చితకబాదారు. దాదాపు చావు అంచులదాకా వెళ్లిన అతనిని పోలీసులకు అప్పగించారు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నజీమ్ ని అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

AI Smart Glasses : పోలీసుల చేతికి ఏఐ అస్త్రం.. ఈ మ్యాజిక్ గ్లాసెస్ నేరస్తులను ఎలా గుర్తిస్తాయి?
uttar Pradsh : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే టాప్... ఏ రాష్ట్రమో తెలుసా?