హాల్‌ టికెట్‌పై సన్నీలియోన్ ఫోటో ..కంగుతిన్న అభ్యర్థి.. కర్ణాటక సర్కారుపై విమర్శలు.. విచారణకు ఆదేశం.. 

By Rajesh KarampooriFirst Published Nov 9, 2022, 2:04 PM IST
Highlights

కర్నాటకలో ఉపాధ్యాయ నియమక  పరీక్షలు జరుగుతున్నాయి. అయితే ఓ యువతికి అందజేసిన హాల్‌ టికెట్‌లో అభ్యర్ది ఫోటో స్థానంలో పోర్న్ స్టార్ సన్నీలియోన్ ఫోటో ఉండటం విమర్శలు దారి తీస్తోంది.
 

కర్ణాటక ఉపాధ్యాయ నియమక పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ అభ్యర్ధి తన హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకుంది. తీరా ఆ హాల్ టికెట్ ను చూస్తే.. ఓ సారిగా కంగుతిన్నది. ఆమెకు జారీ చేసిన హాల్ టికెట్ లో తన ఫోటోకు బదులుగా మాజీ పోర్న్ స్టార్ సన్నీలియోన్ ఫోటో వచ్చింది. తన ఫోటో స్థానంలో పోర్న్ స్టార్ ఫోటో రావడంతో ఆ అభ్యర్థికి దిమ్మతిరిగింది. ప్రస్తుతం ఈ హాల్ టికెట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

దీంతో ప్రభుత్వం తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.హాల్‌ టికెట్‌ని అడ్డుపెట్టుకొని నెటిజన్లు ప్రభుత్వం, బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారం క్రమంగా పెరిగిపోవడంతో రాష్ట్ర విద్యాశాఖ విచారణకు ఆదేశించింది. ఈ విషయంపై ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. కర్ణాటక ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య ట్విట్టర్ వార్ మొదలైంది.
  
కర్ణాటక కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్‌పర్సన్ BR నాయుడు ఆ హాల్ టికెట్ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేస్తూ..'ఉపాధ్యాయ నియామకాల అడ్మిట్ కార్డ్‌లో అభ్యర్థి ఫోటోకు బదులు బ్లూ చిప్ స్టార్ ఫోటో పెట్టారు.సభలో బ్లూ ఫిలిం చూస్తున్న మంత్రులున్న ప్రభుత్వం నుంచి ఇంకేం ఆశించగలమని విమర్శించారు. బీజేపీ నేతలకు సన్నీలియోన్‌ని చూడాలనుకుంటే ఆమె ఫోటోను వేలాడదీయం అంతే కాని అందుకోసం విద్యాశాఖను ఎందుకు ఉపయోగించడమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ಶಿಕ್ಷಕರ ನೇಮಕಾತಿಯ ಪ್ರವೇಶಾತಿ ಪತ್ರದಲ್ಲಿ ಅಭ್ಯರ್ಥಿಯ ಬದಲು ನೀಲಿಚಿತ್ರ ತಾರೆಯ ಫೋಟೋ ಪ್ರಕಟಿಸಲಾಗಿದೆ.

ಸದನದಲ್ಲಿ ನೀಲಿಚಿತ್ರ ವೀಕ್ಷಿಸುವ ಪಕ್ಷದವರಿಂದ ಇನ್ನೇನು ತಾನೇ ನಿರೀಕ್ಷಿಸಲು ಸಾಧ್ಯ? ಅವರೇ, ನೀಲಿಚಿತ್ರ ತಾರೆ ನೋಡುವ ಹಂಬಲವಿದ್ದರೆ ಒಂದು ಫೋಟೋ ನೇತಾಕಿಕೊಳ್ಳಿ, ಅದಕ್ಕೆ ಶಿಕ್ಷಣ ಇಲಾಖೆಯನ್ನು ಉಪಯೋಗಿಸಬೇಡಿ! pic.twitter.com/Czb7W0d1xJ

— B.R.Naidu ಬಿ.ಆರ್.ನಾಯ್ಡು Vasanthnagar (@brnaidu1978)

విచారణకు ఆదేశం..

కర్నాటక ఉపాధ్యాయ నియమక పరీక్షల నిర్వాహణలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై నెటిజన్లు ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.ఈ సన్నీలియోన్ ఫోటో వ్యవహారంలో తీవ్ర రూపం దాల్చడంతో.. ఈఘటనపై కర్నాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.అభ్యర్ధి ఫోటో మారినందుకు పొరపాటును ఒప్పుకొని ఆ ఫోటో స్థానంలో యువతి ఫోటోని అప్‌లోడ్ చేస్తామని వివరణ ఇచ్చింది.

click me!