మల్కన్ గిరి అడవుల్లో ఎన్కౌంటర్... ప్రాణాలతో పట్టుబడ్డ మావోయిస్ట్

By Arun Kumar PFirst Published Nov 28, 2020, 10:34 AM IST
Highlights

గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టులకు మధ్య మల్కన్ గిరి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో ఓ మావోో మృతిచెందగా మరొకరు తీవ్ర గాయాలతో పట్టుబడ్డాడు. 

ఒరిస్సాలోని మల్కన్‌గిరి జిల్లా అడవుల్లో మావోయిస్టులు, గ్రేహౌండ్స్ బలగాలకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. బలగాల కాల్పుల్లో ఓ మావోయిస్ట్ మృతిచెందగా మరొకరు తీవ్ర గాయాలతో పోలీసులకు చిక్కాడు. ఇలా ప్రాణాలతో బైటపడ్డ మావోయిస్ట్ ను దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మావోల నుండి ఏకే 47 గన్ తో పాటు మరికొన్ని మారణాయుధాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను గ్రేహౌండ్స్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. 

ఇటీవలే కొమురంబీమ్ అసిఫాబాద్ జిల్లా అడవుల్లో కూడా తుపాకుల మోత మోగిన విషయం తెలిసిందే. జిల్లాలోని కాగజ్ నగర్ మండల పరిధిలోని కదంబా అడవుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య  పరస్పర కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు.

ఆసిఫాబాద్ జిల్లాలో నక్సలైట్ల సంచారం ఎక్కువయిందన్న సమాచారంతో పోలీసులు విస్తృతంగా కూంబింగ్ చేపట్టారు. ముఖ్యంగా ప్రాణహిత నదీ తీరం వెంట డిఎస్పీ స్వామి పర్యవేక్షణలో 8 గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలోనే కదంబా అడవుల్లో మావోయిస్టులు తారసపడి కాల్పులకు దిగారు. దీంతో పోలీసులు కూడా కాల్పులు జరపగా ఇద్దరు మావోయిస్టులు చనిపోగా కీలక నాయకులు కొందరు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. 
 
కేబీఎం (కుమురం భీం, మంచిర్యాల) డివిజన్‌ కమిటీకి సారథ్యం వహిస్తున్న మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్‌ భాస్కర్‌ తో పాటు వర్గీస్, కాంతీ లింగవ్వ, మరికొందరు మావోలు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు కూంబింగ్ మరింత విస్తృతంగా చేపట్టారు. సంఘటన స్థలంలో మావోలకు సంబంధించిన రెండు తుపాకులు,బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 

click me!