కారు బానెట్ పై వ్యక్తిని ఈడ్చుకెళ్లిన కారు.. ఢిల్లీలో ఘటన (వీడియో)

Published : Jan 14, 2023, 08:31 PM IST
కారు బానెట్ పై వ్యక్తిని ఈడ్చుకెళ్లిన కారు.. ఢిల్లీలో ఘటన (వీడియో)

సారాంశం

ఢిల్లీలో ఓ వ్యక్తిని కారు బానెట్ పై మోసుకెళ్లుతున్న వీడియో ఇప్పుడు సంచలనమైంది. జనవరి 12వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నది.  

న్యూఢిల్లీ: ఈ ఏడాది తొలి రోజే ఉదయం ఢిల్లీలో ఓ మహిళను కొన్ని కిలోమీటర్లు కారు ఈడ్చుకెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. మహిళను కారు కొన్ని కిలోమీటర్లు టైర్ల కిందే ఈడ్చుకెళ్లడంతో ఆమె దారుణంగా మరణించింది. ఈ ఘటన మరువకముందే దీనిని పోలిన ఘటనే ఒకటి తాజాగా అదే ఢిల్లీలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని కారు బానెట్ పై కొంత దూరం తీసుకెళ్లిన ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

ఢిల్లీలోని రజౌరీ గార్డెన్ ఏరియాలో ఓ కారు బానెట్ పై వ్యక్తిని మోసుకెళ్లిన ఘటన ఈ నెల 12వ తేదీన జరిగింది. అయితే, అంతకు ముందే రోడ్డుపై ఓ గొడవ జరిగింది. ఆ గొడవ తర్వాతే ఆ వ్యక్తిని కారు బానెట్ పై అలాగే లాక్కెళ్లిన ఘటన చోటుచేసుకుంది. ఆ వ్యక్తిని కారు బానెట్ పై మోసుకెళ్లుతున్న దృశ్యాలు సీసీటీవీలో కనిపించాయి. 

Also Read: మహిళా డ్యాన్సర్‌తో అసభ్యంగా ప్రవర్తించే ప్రయత్నం.. ఆమె గుణపాఠం ఎలా చెప్పిందంటే? (వీడియో)

ఢిల్లీ పోలీసులు యాక్షన్‌లోకి దిగారు. నిందితుడిని గుర్తించారు. అతడిపై ఐపీసీలోని 279, 323, 341, 308 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని  పోలీసులు విచారిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !
కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు