కరాటే క్లాసులో యువతిపై అత్యాచారం

Published : Oct 19, 2020, 11:15 AM IST
కరాటే క్లాసులో  యువతిపై అత్యాచారం

సారాంశం

ఆమెతో పాటు మరో యువకుడు కూడా కరాటే క్లాసులకు వెళ్లాడు. కాగా.. తిరిగి యువతి రాత్రి 7గంటలకు ఇంటికి చేరుకుంది. కాగా.. ఇంటికి చేరిన రెండు గంటలకు సదరు యువతి తీవ్ర అనారోగ్యానికి గురైంది.

ఆత్మ రక్షణ మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశంతో యువతిని ఆమె తల్లిదండ్రులు కరాటే తరగతులకు పంపించారు. అయితే.. ఆ తరగతులకు సదరు యువతితోపాటు.. అక్కడకు వచ్చే తోటి విద్యార్థి ఆమె పట్ల దారుణంగా ప్రవర్తించాడు. యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఎస్పీ అజయ్ సహానీ మాట్లాడుతూ.. మీరట్ కి చెందిన 18ఏళ్ల యువతి శుక్రవారం సాయంత్రం కరాటే క్లాసులకు వెళ్లింది. కాగా.. ఆమెతో పాటు మరో యువకుడు కూడా కరాటే క్లాసులకు వెళ్లాడు. కాగా.. తిరిగి యువతి రాత్రి 7గంటలకు ఇంటికి చేరుకుంది. కాగా.. ఇంటికి చేరిన రెండు గంటలకు సదరు యువతి తీవ్ర అనారోగ్యానికి గురైంది.

వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. పరిశీలించిన వైద్యులు.. అత్యాచారం జరిగిందని గుర్తించారు. వెంటనే బాధితురాలి నుంచి వివరాలు రాబట్టిన పేరెంట్స్.. పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్
Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు