సిక్ లీవ్‌ పెట్టి.. పబ్ లో చిందులు.. మద్యం మత్తులో మహిళకు వేధింపులు.. ఓ పోలీసు అధికారి నిర్వాకం..

Published : Aug 10, 2023, 01:18 PM IST
సిక్ లీవ్‌ పెట్టి.. పబ్ లో చిందులు.. మద్యం మత్తులో మహిళకు వేధింపులు.. ఓ పోలీసు అధికారి నిర్వాకం..

సారాంశం

ఓ పబ్‌లో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించినందుకు గోవా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ)పై విచారణ చేపట్టారు.  

గోవా : గోవా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డిఐజి) బాగా పట్టణంలోని పబ్‌లో ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్లు వీడియోలు వెలుగు చూడడంతో.. దీనిమీద విచారణను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ పోలీసు మాజీ అధికారి ఎ కోన్‌గా గుర్తించిన డిఐజి ఈ గొడవ సమయంలో మద్యంమత్తులో ఉండటంతో గొడవకు దారి తీసింది.

రాష్ట్రంలోని బాగా పట్టణంలోని ఓ పబ్‌లో ఓ మహిళతో సోమవారం రాత్రి అసభ్యంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన  విషయం వెలుగు చూడడంతో గోవా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ)పై విచారణ చేపట్టారు. ఎ కోన్‌గా గుర్తించబడిన డిఐజి ఇంతకుముందు ఢిల్లీ పోలీస్ డిపార్ట్ మెంట్ లో ముఖ్యమైన పదవులను నిర్వహించారు.

సీఎం కుమార్తెకు చెల్లింపులపై వ్యవహారం.. ప్రతిపక్షాలు ఎందుకు నోరు మెదపడం లేదు..!!

ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగింది. సమాచారం ప్రకారం, సంఘటన సమయంలో కోన్ మద్యం మత్తులో ఉన్నాడు. రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నాయకుడికి చెందినదిగా చెబుతున్న ఓ క్లబ్‌లో ఒక మహిళతో వాగ్వాదానికి దిగాడు. ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడని సమాచారం. 

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి, డీఐజీ, మహిళ గొడవకు దిగారు. ఈ సమయంలో మహిళ పోలీసును చెప్పుతో కొట్టడంతో కలకలం రేగింది. ఘటన జరిగిన సమయంలో డీఐజీ మెడికల్ లీవ్‌లో ఉన్నారు. కేసు దర్యాప్తులో ఈ విషయం తేలింది.

ఈ ఘటన మీద స్పందిస్తూ ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ విషయం గోవా శాసనసభలో కూడా ప్రస్తావనకు వచ్చింది. అనుచితంగా ప్రవర్తించి.. డిపార్ట్ మెంటుకు చెడ్డపేరు తెచ్చిన సదరు పోలీసు సస్పెన్షన్ చేయాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?