ప్రేమించుకున్నారని.. మెడలో టైర్లువేసి.. బలవంతంగా..!

Published : Sep 23, 2021, 08:40 AM ISTUpdated : Sep 23, 2021, 08:43 AM IST
ప్రేమించుకున్నారని.. మెడలో టైర్లువేసి.. బలవంతంగా..!

సారాంశం

తాను ఇంటి నుంచీ పారిపోయిన ప్రేయసీప్రియులకి సాయం చేసిందంటూ రోడ్డుకీడ్చారు. 13 ఏళ్ల మైనార్‌ మెడలో కూడా టైరు వేసి అందరి ముందూ నృత్యం చేయించారు.

వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. వారిద్దరూ కనీసం మైనర్లు కూడా కాదు. కానీ వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో.. ఇంట్లో నుంచి పారిపోయారు. గుజరాత్‌లో కొంత కాలం ఉండీ మధ్యప్రదేశ్‌లోని ధార్‌ ప్రాంతానికి తిరిగి వచ్చారు. స్వగ్రామం వచ్చిన ఆ ప్రేమికులకి దారుణమైన అవమానం తప్పలేదు. 

ఊర్లోని కొందరు... సదరు లవర్స్ మెడల్లో మోటారు టైర్లు వేసి అందరి ముందూ బలవంతంగా డ్యాన్స్ చేయించారు. అది చాలదన్నట్టు మరో 13 ఏళ్ల బాలికను కూడా ఈ అమానుషంలోకి లాగారు. తాను ఇంటి నుంచీ పారిపోయిన ప్రేయసీప్రియులకి సాయం చేసిందంటూ రోడ్డుకీడ్చారు. 13 ఏళ్ల మైనార్‌ మెడలో కూడా టైరు వేసి అందరి ముందూ నృత్యం చేయించారు.

చట్టరిత్యా మేజర్స్‌ అయిన ప్రేమికులపైన దాడి... మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఉన్న కుండీ గ్రామంలో, సెప్టెంబర్ 12న జరిగింది. ఇందులో మరో దారుణం ఏంటంటే పారిపోయి తిరిగి వచ్చిన యువతీయువకులపై భౌతిక దాడి కూడా చోటు చేసుకుంది. సొషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోలో వార్ని మరో వ్యక్తి కర్రతో కొట్టటం స్సష్టంగా కనిపించింది. నెటిజన్స్ దీనిపై తీవ్రంగా స్సందించటంతో కేసు పోలీసుల వద్దకు చేరింది. మొత్తం అయిదుగురు నిందితులుగా ఉండగా ఇప్పటికే ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు దొరకాల్సి ఉంది. నిందితులపై పోలీసులు పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు పెట్టారు. 

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu