రెయిడ్ కి వచ్చారని రెచ్చిపోయారు.. ఏఎస్ఐ చేతులను తాళ్లతో కట్టేసి.. చితకబాది.. వీరంగం...

By AN TeluguFirst Published Nov 8, 2021, 7:45 AM IST
Highlights

ఓ ఏఎస్ఐ పై కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. తాళ్లతో కట్టేసి చితకబాదారు. బీహార్లో diwali నాడు జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో socia mediaలో చక్కర్లు కొడుతోంది.  

పాట్నా : బీహార్ లో దారుణం జరిగింది. అల్లరిమూకలకు పోలీసులంటే కూడా భయం లేకుండా పోతోంది. సాక్షాత్తు ఓ ఏఎస్ఐని పట్టుకుని చితకబాది... దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. రక్షక భటులకే రక్షణ లేకుండా పోతుందా? అనే సందేహాన్ని కలిగించే ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెడితే... 

ఓ ఏఎస్ఐ పై కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. తాళ్లతో కట్టేసి చితకబాదారు. బీహార్లో diwali నాడు జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో socia mediaలో చక్కర్లు కొడుతోంది.  తూర్పు చంపారణ్ జిల్లా మోతిహారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ధరంపూర్ గ్రామంలో గొడవ జరుగుతుందని దీపావళి రోజు సాయంత్రం policeలకు సమాచారం అందింది. 

దీంతో ఏఎస్ఐ సీతారాం హుటాహుటిన అక్కడకు బయలుదేరి వెళ్లారు. అయితే, ఏఎస్ఐ అక్కడికి వెళ్లడంతో youth మరింత రెచ్చిపోయారు. దీపావళి పండుగనాడు Police patrolling ఎలా చేస్తారంటూ ASIతొ వాగ్వాదానికి దిగారు. 

అది కాస్త ముదిరింది. పోలీసులు అని కూడా చూడకుండా... కాస్త కూడా భయం లేకుండా..  దుర్భాషలాడుతూ ఏఎస్ఐపై దాడికి తెగబడ్డారు. అంతటితో ఆగకుండా.. స్థానిక బలం.. గుంపు బలం చూసుకుని ఏఎస్ఐ చేతులను తాడుతో వెనక్కి కట్టేశారు. అందరూ కలిసి అతన్ని చితకబాదారు.

ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో viral video అయింది. బాగా కొట్టిన తరువాత పోలీసును వదిలేయడంతో.. బతుకుజీవుడా అనుకుంటూ ఆయన పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అనంతరం పలువురు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంత ఘాతుకానికి తెగబడ్ నిందితుల కోసం గాలిస్తున్నారు.

సుకుమా జిల్లాలో జవాన్ కాల్పులు: ముగ్గురు జవాన్ల మృతి, నలుగురికి గాయాలు

జైలు సిబ్బందిపై ఖైదీల దాడి...
లక్నో: Uttar Pradesh రాష్ట్రంలోని Fatehgarh  సెంట్రల్ జైలులో ఖైదీలు వీరంగం సృష్టించారు. జైలు సిబ్బందిపై దాడికి దిగారు. ఇద్దరు డిప్యూటీ జైలర్లను జైలులో బంధించారు. ఆదివారం నాడు ఉదయం ఈ జైలులో అల్లర్లు చెలరేగాయి. 

జైలులో కొంత బాగానికి prioners నిప్పంటించారు. అంతేకాదు ఖైదీలు కొందరు జైలు అధికారులపై రాళ్లతో దాడికి దిగారు. ఇద్దరు డిప్యూటీ జైలర్లు అఖిలేష్ కుమార్, శైలేష్ కుమార్లు ఖైదీల చెరలో ఉన్నారు. ఖైదీలను చెదరగొట్టేందుకు పోలీసులు, జైలు అధికారులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. 

అయినా ప్రయోజనం కనిపించలేదని జైలు ఉన్నతాధికారులు తెలిపారు. సందీప్ కుమార్ అనే అండర్ ట్రయల్ ఖైదీ చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో ఖైదీలు ఆగ్రహంతో వీరంగం సృష్టించారు. సందీప్ కుమార్ కు చికిత్స అందించడానికి ఆలస్యం చేశారని ఖైదీలు ఆరోపిస్తున్నారు. 

మరోవైపు సీనియర్ సూపరింటెండ్ ఆఫ్ పోలీస్ జిల్లా మేజిస్ట్రేట్ ప్రస్తుతం జైలు ప్రాంగణంలో ఖైదీలను శాంతింపజేసే పనిలో ఉన్నారని ఫరూఖాబాద్ అదనపు ఎస్పీ అజయ్ పాల్ సింగ్ చెప్పారు.మరోవైపు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు జైలు వద్దకు భారీగా పోలీస్ బలగాలను తరలించారు.

ఖైదీల దాడిలో సుమార 30 మంది పోలీసులు గాయపడ్డారు. గాయపడిన పోలీసులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మేరాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న సందీప్ హత్య కేసులో జైలులో ఉన్నాడు  జైలులో ఉన్న సందీప్  అనారోగ్యంతో మరణించారు. జైలులో ఉన్న సమయంలో ఆయన చికిత్స పొందుతూ చనిపోయిన విషయాన్ని తెలుసుకొన్న ఖైదీలు వీరంగం సృష్టించారు.

సందీప్ కుమార్ చనిపోయిన విషయం తెలుసుకొన్న ఖైదీలు ఇద్దరు డిప్యూటీ జైలర్లను తీవ్రంగా కొట్టారు.ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకొన్న సీఓ ప్రదీప్ సింగ్, ఫతేఘర్ కొత్వాల్, జై ప్రకాష్ పాల్ కొందరు పోలీసులు చేరుకొన్నారు. దీపావళి రోజున సరైన భోజనం కూడా అందడం లేదని ఖైదీలు ఆరోపిస్తున్నారు. దీపావళి రోజున జైలును ఓపెన్ చేయకపోవడంతో తాము ఎవరిని కలవలేకపోయామని ఖైదీలు ఆరోపించారు.
 

click me!