'అది మా హక్కు' : కేంద్రంపై ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం

By Rajesh KarampooriFirst Published Jun 6, 2023, 11:02 PM IST
Highlights

జమ్మూకాశ్మీర్ లో ఎన్నికలు ఆలస్యం కావడంపై భారత ఎన్నికల సంఘం (ఇసి)ని ప్రశ్నిస్తూ.. ఇక్కడ ఎన్నికలను ఆలస్యం చేస్తున్నందుకు భారత ఎన్నికల సంఘంపై ఏమైనా ఒత్తిడి ఉందా? అని నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్  ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. 

జమ్ముకాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో జాప్యంపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్  ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు పౌరుల హక్కు అని, కేంద్ర పాలిత ప్రాంతంలో (యుటి) అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు నిర్వహించాలో ఎన్నికల సంఘం ప్రజలకు వివరించాలని అన్నారు. కానీ అలా జరగడం లేదని విమర్శలు గుప్పించారు.

ఎన్నికలపై మనకంటే మీడియాకే ఎక్కువ శ్రద్ధ ఉందని ఒమర్ అబ్దుల్లా అన్నారు. మేం ఆకలితో అలమటించేవాళ్లం కాదని, ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలని మోకాళ్లపై నిలబడి వేడుకుంటారని అన్నారు. ఎన్నికలు మా హక్కు అని, ఇక్కడ ఎన్నికలు నిర్వహించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే హక్కు జమ్మూకశ్మీర్ ప్రజలకు ఉందని కేంద్ర ప్రభుత్వాన్ని పేరు పెట్టకుండా అన్నారు. తమ హక్కులను హరించడం ద్వారా వారు సంతృప్తి పొందితే ఫర్వాలేదు అని అబ్దుల్లా అన్నారు.

 జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికల డిమాండ్‌పై నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ , కాంగ్రెస్‌ల ప్రతినిధి బృందం మార్చిలో ఢిల్లీలో ECIని కలిసింది. నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ , ఒమర్ అబ్దుల్లా తండ్రి ఫరూక్ అబ్దుల్లా, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి) చీఫ్ మెహబూబా ముఫ్తీ, కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు ప్రమోద్ తివారీ ప్రతినిధి బృందంలో సభ్యులుగా ఉన్నారు. ఈ అంశాన్ని పరిశీలిస్తామని ఈసీ తమకు హామీ ఇచ్చిందని సమావేశం అనంతరం అబ్దుల్లా తెలిపారు. ఈ విషయాన్ని తాము పరిశీలిస్తున్నామని EC తమకు హామీ ఇచ్చిందనీ ఒమర్ అబ్దుల్లా అన్నారు.

భారతదేశానికి పట్టం కట్టిన రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం దురదృష్టకరమనీ, J&Kలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామని ఆయన అన్నారు. బీజేపీ ఓడిపోతామన్న భయంతో J&K లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించడం లేదని అన్నారు. జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలంటే బీజేపీ భయపడుతోందని, కాశ్మీర్‌లోనే కాకుండా జమ్మూలో కూడా ఘోరంగా ఓడిపోతామని వారిని తెలుసుననీ, త్రిపుర, నాగాలాండ్, కర్ణాటకలో ఎన్నికలు నిర్వహించగలిగితే ఇక్కడ ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. జమ్మూకశ్మీర్‌ను నాశనం చేశామని బీజేపీకి తెలుసుననీ,  ఇక్కడ ఘోరంగా ఓడిపోతామని వారికి తెలుసునని ఆయన అన్నారు.

click me!