'బీజేపీకి ఆ ధైర్యం లేదు..': ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

Published : Dec 14, 2022, 07:16 PM IST
'బీజేపీకి ఆ ధైర్యం లేదు..': ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

సారాంశం

జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల కోసం తమ పార్టీ కేంద్రాన్ని వేడుకోదని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా అన్నారు. దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్‌లో జరిగిన పార్టీ కార్యక్రమం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల ఆలస్యం తమ పార్టీకి ఆందోళన కలిగించదని అన్నారు. కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించే ధైర్యం బీజేపీకి లేదని, భయపడిపోయిందని ఆయన అన్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు, జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఒమర్ అబ్దుల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను, తన పార్టీ కేంద్ర ప్రభుత్వం వద్దకు భిక్షాటన చేయబోమని అన్నారు. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించాలంటే..  బిజెపి భయపడుతోందని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చూడాలనీ, తాము ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నామని, కానీ, ఎన్నికలు నిర్వహించాలని కేంద్రాన్ని అడగబోనని అన్నారు.

ఎన్నికలంటే బీజేపీ భయపడుతోంది

కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం ఎప్పుడు నిర్ణయించినా తమ పార్టీ సిద్ధంగా ఉంటుందని అన్నారు.  బీజేపీ సభ్యులు భయపడుతున్నారనీ, వారికి ఎన్నికలు నిర్వహించే ధైర్యం లేదని అన్నారు. పార్టీ బహిరంగ సభలు తమ కార్యకర్తలకు ఎన్నికలు సమీపిస్తున్నాయన్న సంకేతం కాదని పేర్కొన్నారు.పార్టీని బలోపేతం చేయడానికి, లొసుగులను గుర్తించడానికి , వాటిని పూడ్చడానికి కార్యకర్తలతో సమావేశమవుతున్నారని అన్నారు.  

పీఎస్‌ఏ రద్దు  

జమ్మూ కాశ్మీర్‌లో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత .. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ (పీఎస్‌ఏ)ని రద్దు చేస్తానని, తన స్టాండ్‌కు అండగా నిలిచానని అబ్దుల్లా చెప్పారు. పీఎస్‌ఏ రద్దులో కొత్తగా ఏమీ లేదని, ఈ విషయంలో తాను వింతగా మాట్లాడలేదన్నారు. గత కొన్నేళ్లుగా ఇదే మాట నిరంతరం చెబుతున్నానని.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే చెప్పానని భావిస్తున్నానని, దానికి అండగా నిలుస్తానని చెప్పారు. నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక, చట్టపరంగా ఈ చట్టాన్ని తొలగిస్తామని అన్నారు.

దేశంలో ఎక్కడా ప్రజా భద్రతా చట్టం లేదు

ప్రజలను అణచివేయడానికి ఉపయోగపడే చట్టాలను మాత్రమే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉంచిందని ఉమర్ పార్టీ కార్యకర్తలతో అన్నారు. దేశంలో ఎక్కడా ప్రజా భద్రతా చట్టం లేదని, జమ్మూకశ్మీర్‌లో మాత్రమే ఈ చట్టం ఉందన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలిరోజే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని ఇదివరకే చెప్పాను, మళ్లీ చెబుతున్నాననీ అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Womens Welfare Schemes : ఇక్కడి మహిళలకు సూపర్ స్కీమ్స్.. దేశంలోనే నెంబర్ 1
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీకి రాష్ట్రీయ బాల్ పురస్కార్ | Asianet News Telugu