చెల్లెలికి మాయమాటలు చెప్పి.. వారివరసలు మరిచి గర్భవతిని చేసి.. ఓ అన్న ఘాతుకం...

Published : Apr 29, 2022, 11:15 AM IST
చెల్లెలికి మాయమాటలు చెప్పి.. వారివరసలు మరిచి గర్భవతిని చేసి.. ఓ అన్న ఘాతుకం...

సారాంశం

వావివరుసలు మరిచిన ఓ మానవమృగం చెల్లెలిమీదే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. దీంతో అసలు విషయం బైటికి రావడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

తిరువళ్లూరు : విద్యార్థినికి మాయమాటలు చెప్పి Pregnantని చేసిన అన్నను తిరువళ్లూరు Woman police అరెస్టు చేశారు. వివరాలు.. ఆరణి ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని ప్లస్ టూ చదువుతోంది. అయితే పాఠశాలకు వెళ్లి రావడానికి బస్సు సదుపాయం లేకపోవడంతో తిరువళ్లూరు సమీపంలోని రామతండలం గ్రామంలోని పెద్దమ్మ కర్పగం వద్ద ఉంటూ చదువుకుంటోంది. అయితే, ఇంట్లో ఎవరూ లేని సమయంలో కర్పగం కుమారుడు నాగరాజ్ వరసకు చెల్లెలు అయ్యే Studentకి మాయమాటలు చెప్పి పలుమార్లు molestation చేసినట్లు తెలుస్తోంది. 

ఇటీవల విద్యార్థిని అనారోగ్యానికి గురికావడంలో అనుమానించిన తల్లిదండ్రులు ఆమెను సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ఆమె గర్భం దాల్చినట్టు నిర్థారించారు. దీంతో, బాధిత విద్యార్థిని తలిదండ్రులు తిరువళ్లూరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక గర్భం దాల్చడానికి ఆమె పెద్దమ్మ కొడుకు నాగరాజ్ కారణమని తెలియడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా ఇదివరకే నాగరాజ్ కు వివాహామై ఇద్దరు పిల్లలు ఉండడం గమనార్హం.

అత్యాచారానికి పాల్పడిన మైనర్ కు వినూత్నిశిక్ష...
మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో మైనర్ బాలుడికి తిరువళ్లూరు కోర్టు న్యాయమూర్తి రాధిక వినూత్న శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించారు. వివరాలు.. తిరువళ్లూరు పిల్లా పళ్లిపట్టు ప్రాంతానికి చెందిన 17 యేళ్ల బాలుడు, అదే ప్రాంతానికి చెందిన 16యేల్ల మైనర్ బాలిక మీద అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. బాలిక తల్లి 2021లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఈ కేసు విచారణ తిరువళ్లూరులోని జువైనల్ కేసులను విచారించే ప్రత్యేక కోర్టులో సాగింది. విచారణలో నిందితుడి నేరం ఒప్పుకోవడంతో న్యాయమూర్తి రాధిక తీర్పును వెలువరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకూడదన్న ఉద్దేశంతో ఏడాదిపాటు పళ్లపట్టు ప్రభుత్వ వైద్యశాలలో పారిశుద్ధ్య పనులను చేట్టాలని ఆదేశించారు. 

ఇదిలా ఉండగా, nizamabadలో ఓ మానసిక వికలాంగురాలిమీద పెదనాన్న, మరోవ్యక్తి అఘాయిత్యానికి పాల్పడిన ఘటన గురువారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అత్యంత దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనాథగా మారిన సొంత తమ్ముడి కూతురిని అక్కున చేర్చుకుని ఆ పెదనాన్న దారుణానికి ఒడిగట్టాడు. కన్నకూతుర్లా చూసుకోవాల్సిన ఆ పెద్దమ్మ కాసులకు కక్కుర్తిపడి.. మానసిక వికలాంగురాలు అనైనా చూడకుండా.. సభ్యసమాజం తలదించుకునేలాంటి పనికి ఒడిగట్టింది. 

తల్లిదండ్రులను కోల్పోయిన 14 ఏళ్ల బాలికను ఎనిమిదేళ్ల క్రితం.. సొంత పెదనాన్న, పెద్దమ్మలు అక్కున చేర్చుకున్నట్లు చేర్చుకుని.. ఇప్పుడు పెదనాన్నవయసు వావివరుసలు మరచి పోయి ప్రవర్తిస్తే.. డబ్బు కక్కుర్తితో పెద్దమ్మ ఆ యువతిని ఓ వ్యక్తికి అప్పగించి దుర్భుద్ధి చూపించింది. ఎంత ధైన్యమైన పరిస్థితి అంటే వీరిద్దరి దాష్టీకం హద్దుమీరి సాగుతున్నా వాటి గురించి తెలుసుకోలేని స్థితి ఆమెది. ఎందుకంటే ఆమె దివ్యాంగురాలు. మానసిక వైకల్యంతో ఉన్న ఆమె తనకు ఏం జరిగినా బయటకు వ్యక్తం చేయలేని నిస్సహాయురాలు. ప్రస్తుతం బాధిత యువతి 8 నెలల గర్భిణీ. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది.  గురువారం ఉదయం ఇది వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?