హిజ్రాలా ఉన్నావంటూ ఉద్యోగినికి వేధింపులు...

Published : Jan 27, 2021, 01:56 PM IST
హిజ్రాలా ఉన్నావంటూ ఉద్యోగినికి వేధింపులు...

సారాంశం

ఆ అపార్ట్‌మెంట్లో‌ నివాసముండే 56 ఏళ్ల మహిళకు ఉద్యోగినికి మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సదరు మహిళ ‘పొట్టి జుట్టు, బట్టలు.. హిజ్రాలా ఉన్నావ్‌’ అంటూ ఉద్యోగినిపై వేధింపులకు దిగేది

తోటి మహిళ అనే గౌరవం కూడా లేకుండా.. హిజ్రా లాగా ఉన్నావంటూ ఓ మహిళ కించపరిచింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబయిలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

36ఏళ్ల మహిళ గుర్గావ్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో జనరల్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తోంది. 2020 డిసెంబర్ లో అదే ప్రాంతంలోని ఓ అపార్ట్ మెంట్ లో అద్దెకు దిగింది. ఆ అపార్ట్‌మెంట్లో‌ నివాసముండే 56 ఏళ్ల మహిళకు ఉద్యోగినికి మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సదరు మహిళ ‘పొట్టి జుట్టు, బట్టలు.. హిజ్రాలా ఉన్నావ్‌’ అంటూ ఉద్యోగినిపై వేధింపులకు దిగేది

. దీంతో సదరు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తనపై వేధింపులకు పాల్పడుతున్న మహిళపై ఫిర్యాదు చేసింది. దీనిపై శనివారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

‘‘ నేను అపార్ట్‌మెంట్‌ బిల్డింగ్‌లోకి వచ్చిన కొత్తలో సదరు మహిళ దగ్గరే టిఫిన్‌ కొనుక్కునేదాన్ని. రుచిగా వండకపోవటంతో ఆమె దగ్గర తినటం మానేశాను. తర్వాత ఆమె కుమారుడితోనూ చిన్న వాగ్వివాదం అయింది. ఆ రోజునుంచి కుటుంబానికి దూరంగా ఉంటున్నాను. అప్పటినుంచి నన్ను వేధించటం మొదలుపెట్టింది. ‘‘ నువ్వు ఆడా.. మగా? నీ గొంతు కుక్కలాగా ఉంది’’ అంటూ నీచంగా మాట్లాడేది. నేను ఓ నెల రోజుల పాటు దీన్నంతా భరించాను. ఎక్కడికి పడితే అక్కడికి వచ్చి నన్ను బూతులు తిట్టేది. స్నేహితుల ముందు అవమానించేది’’ అని పేర్కొంది.
 

PREV
click me!

Recommended Stories

Indian Railways: ట్రైన్‌లో లగేజ్ పోతే రైల్వేనే డబ్బులిస్తుందా? ఈ షాకింగ్ రూల్ మీకు తెలుసా !
అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే Udayanidhi Stalin విడుదల | Udhayanidhi Stalin Released Within Hours