రూ. 50కే అన్‌లిమిటెడ్ భోజనం అందిస్తున్న వృద్ద జంట.. వీడియో వైరల్.. హ్యాట్సాప్ చెబుతున్న నెటిజన్లు

Published : Apr 26, 2022, 01:16 PM IST
రూ. 50కే అన్‌లిమిటెడ్ భోజనం అందిస్తున్న వృద్ద జంట.. వీడియో వైరల్.. హ్యాట్సాప్ చెబుతున్న నెటిజన్లు

సారాంశం

సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు దర్శనమిస్తుంటాయి. అయితే అందులో కొన్ని వీడియోలు చాలా భిన్నంగా, వినూత్నంగా ఉంటాయి. అలాంటివి నెటిజన్లను ఆకర్షిస్తుంటాయి. ఇలాంటి వీడియోల్లో ఫుడ్ వీడియోలు కూడా నిలుస్తున్నాయి. 

సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు దర్శనమిస్తుంటాయి. అయితే అందులో కొన్ని వీడియోలు చాలా భిన్నంగా, వినూత్నంగా ఉంటాయి. అలాంటివి నెటిజన్లను ఆకర్షిస్తుంటాయి. ఇలాంటి వీడియోల్లో ఫుడ్ వీడియోలు కూడా నిలుస్తున్నాయి. ఈ రకమైన వీడియోలకు కూడా పెద్ద సంఖ్యలో వీక్షకులు ఉన్నారు. అయితే తాజాగా వయసు పైబడిన ఓ వృద్ద జంట స్టోరి.. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. ఎందుకంటే వారు రూ. 50కే అపరిమిత భోజనం అందిస్తున్నారు. 

నిత్యావసరాల ధరలు రోజురోజుకు పెరుగుతన్న వేళ.. హోటళ్లలో ఆహార పదార్థాల ధరలు కూడా పెరుగుతున్నాయి. అయితే అవేమీ లెక్కచేయకుండా వయసు పైబడినా కూడా పట్టించుకోకుండా తక్కువ ఖర్చులో రుచికరమైన భోజనాన్ని అందిస్తూ ఉపాధి పొందుతున్నారు. స్పూర్తి కలిగించే ఈ వృద్ద దంపతుల వీడియోను @rakshithraiy, @_mr.swashbuckler_ అనే బ్లాగర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. నాలుగు రోజుల్లోనే ఈ వీడియోకు 1.6 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. 

ఇక, ఈ వీడియోలను వివరాల ప్రకారం.. వృద్ద దంపతులు నడుపుతున్న హోటల్ కర్ణాటకలోని మణిపాల్‌లోని రాజ్‌గోపాల్ నగర్ రోడ్డులో ఉంది. 1951 నుంచి వీరు హోటల్‌ను కొనసాగిస్తున్నారు. ఆహ్లాదకర వాతావరణం ఉన్న ఆ హోటల్‌‌ను పరిశుభ్రతతో నిర్వహిస్తున్నారు. హోటల్ పేరు గణేష్ ప్రసాద్ కాగా.. స్థానికులు ‘‘అజ్జా అజ్జి మనే’’ అని పిలుస్తారు. ప్రతి రోజు మధ్యాహ్నం 12 నుంచి 3 గంట వరకు హోటల్‌ తెరిచి ఉంటుంది. 

 

ఈ హోటల్‌లో రూ. 50తో కడుపు నిండా భోజనం చేయవచ్చు. ఈ హోటల్‌లో అన్నం, రసం, పప్పు, పాయసం, సలాడ్, పెరుగును భోజనంలో భాగంగా అందిస్తారు. సంప్రదాయ పద్దతిలో అరటి ఆకులపై వడ్డిస్తారు. అంతేకాకుండా చిరునవ్వుతో భోజనం అంజేస్తారు. వ్యాపారం కంటే మానవత్వం, ప్రేమ విలువలను పరిచయం చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ మారడంతో చాలా మంది నెటిజన్లు ఆ జంటను ప్రశంసిస్తున్నారు. వారికి హ్యాట్సాప్ చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?