ఓలా డ్రైవర్ ఘాతుకం: యువతిని దుస్తులిప్పించి, ఫొటోలు తీశాడు

First Published Jun 5, 2018, 7:19 PM IST
Highlights

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓలా డ్రైవర్ నీచానికి ఒడిగట్టాడు. 

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓలా డ్రైవర్ నీచానికి ఒడిగట్టాడు.  విమానాశ్రయానికి ఓలా క్యాబ్ బుక్ చేసుకున్న యువతికి డ్రైవర్ నరకం చూపించాడు. టాక్సీని దారి మళ్లించి నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి, ఆమె చేత బలవంతంగా దుస్తులిప్పించి, ఫొటోలు తీసి వాట్పాప్ షేర్ చేశాడు. 

ఆర్కిటెక్ట్ అయిన 26 ఏళ్ల యువతి ముంబైకి తెల్లవారుజామున విమనం ఎక్కడానికి జూన్ 1వ తేదీన 2 గంటల ప్రాంతంలో క్యాబ్ బుక్ చేసుకుంది. టోల్ గేట్ కు ముందు డ్రైవర్ వేరే దారి పట్టి, ఇది వేగంగా వెళ్లవచ్చునని నమ్మబలికాడు. 

ఆ యువతి ఫిర్యాదు ప్రకారం... ఆ తర్వాత డ్రైవర్ కారును నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి యువతిని లోపల ఉంచి తాళమేసి, దాడికి దిగాడు. ఆమె ఫోన్ లాక్కుని, తనకు సహకరించకపోతే మిత్రులను పిలిపించి సామూహిత అత్యాచారం చేయిస్తానని బెదిరించాడు. 

బెదిరించి దుస్తులిప్పించి ఫోటోలు తీసి వాట్సాప్ లో షేర్ చేశాడు. అతని నుంచి తప్పించుకోవడానికి యువతి కాళ్లావేళ్లా పడింది. చివరకు ఆమెను విమానాశ్రయంలో వదిలేశాడు. ఆ తర్వాత పోలీసులకు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది. 

డ్రైవర్ అరుణ్ వి పోలీసులు మూడు గంటల లోపల అరెస్టు చేశారు. పోలీసు వెరిఫికేషన్ లేకుండా అతన్ని డ్రైవర్ గా ఎందుకు తీసుకున్నారని ఓలా కంపెనీని సంజాయిషీ అడిగారు. తమ కస్టమర్ కు దురదృష్టకరమైన అనుభవం ఎదురైనందుకు తాము విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఓలా అధికార ప్రతినిధి చెప్పారు .

click me!