హాల్దీరామ్‌కు షాక్: వడ, సాంబార్‌లో బల్లి.. ఔట్‌లెట్‌ సీజ్

By Siva KodatiFirst Published May 17, 2019, 7:40 AM IST
Highlights

ప్రముఖ చిరుతిళ్ల తయారీ సంస్థ హల్దీరామ్‌కు చెందిన హోటల్‌ను ఆహార, ఔషద నియంత్రణ అధికారులు మూసివేశారు. వివరాల్లోకి వెళితే... ఇద్దరు వ్యక్తులు నాగ్‌పూర్‌లోని అంజని స్క్వేర్‌లో ఉన్న హల్దీరామ్స్ ఔట్‌లెట్‌కు వచ్చి వడ, సాంబార్ ఆర్డర్ ఇచ్చారు

ప్రముఖ చిరుతిళ్ల తయారీ సంస్థ హల్దీరామ్‌కు చెందిన హోటల్‌ను ఆహార, ఔషద నియంత్రణ అధికారులు మూసివేశారు. వివరాల్లోకి వెళితే... ఇద్దరు వ్యక్తులు నాగ్‌పూర్‌లోని అంజని స్క్వేర్‌లో ఉన్న హల్దీరామ్స్ ఔట్‌లెట్‌కు వచ్చి వడ, సాంబార్ ఆర్డర్ ఇచ్చారు.

ఈ పదార్ధాలు తింటుండగా అందులో చనిపోయిన బల్లి కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని ఔట్‌లెట్ సూపర్‌వైజర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆ ఆహారాన్ని పడేశారు. అయితే ఆ వెంటనే బల్లి పడిన ఆహారాన్ని తిన్న ఇద్దరు వ్యక్తులు అస్వస్థతకు గురికావడంతో హోటల్ సిబ్బంది వారిని ఆసుపత్రికి తరలించారు.

వారి ఫిర్యాదు మేరకు ఔట్‌లేట్‌లోని వంట గదిని తనిఖీ చేయగా చాలా లోపాలు కనిపించాయి.. దీంతో సరైన ప్రమాణాలు పాటించని కారణంగా సదరు ఔట్‌లెట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కిచెన్‌ను ఆహార భద్రత ప్రమాణాల నిబంధనల ప్రకారం మార్పులు చేసినప్పుడే ఔట్‌లెట్‌ను తెరిచేందుకు అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు. 

click me!