
తెలంగాణలో పదో తరగతి, ఇంటర్ ఫలితాల విడుదల అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే పొరుగు రాష్ట్రం ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలను వెలువడ్డాయి.దీంతో తెలంగాణలో ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారన్న చర్చ జోరుగా సాగుతోంది. ఫలితాల విడుదలపై ఇంటర్ బోర్డు నుంచి అధికార అప్టేట్స్ రాకపోవడంతో వివిధ తేదీల్లో ఫలితాలు రానున్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది. పలు మీడియా సంస్థలు కూడా ఫలితాల విడుదలపై వివిధ రకాల ఊహా కథనాలను వెల్లడిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఈ వారంలో ఫలితాలను ప్రకటించనున్నట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. అంటే.. ఈ నెల 10 తేదీలోపు ఫలితాలు విడుదల అవుతాయని ఇంటర్ బోర్డు వర్గాలు వెల్లడించాయి. ఈ మేరుకు సన్నాహకలు చేస్తున్నట్టు తెలిపింది. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనాన్ని పూర్తి చేశాయి. రిజల్ట్ పరంగా ఎటువంటి తప్పులు జరగకుండా తగ్గు చర్యలు తీసుకుంటున్న అధికారిక వర్గాల సమాచారం.
ఈ పరిణామ నేపథ్యంలో ఇంటర్ బోర్డు నుంచి ఒకటి, రెండు రోజుల్లో అధికారిక ప్రకటన విడుదలయ్యే ఛాన్స్ ఉంది. మొత్తం మీద ఈ నెల 10వ తేదీ నాటికి తప్పనిసరిగా ఫలితాలు విడుదల అవుతాయని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంటర్ ఫలితాల కోసం tsbie.cgg.gov.in అనే వెబ్‌సైట్లను లాగిన్ అవొచ్చు.
ఇక.. SSC పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరిగాయి. దీనికి సంబంధించిన ప్రశ్న ప్రతాల మూల్యాంకనం కూడా పూర్తయ్యింది. ఫలితాల్లో ఎట్లాంటి పొరపాట్లకు జరుగకుండా ఉండేలా SSC బోర్డు అవసరమైన అన్ని చర్యలను చేపట్టింది. ఈ పరీక్ష ఫలితాలు కూడా వారం రోజుల లోపు వెలువడే అవకాశమున్నట్టు సమాచారం.