Maharashtra : జూన్ 10 లోపు ఎన్‌సీపీలో మరో కీలక పరిణామం... సంచలన ఆరోపణలు చేసిన బీజేపీ నేత

Published : May 07, 2023, 06:48 PM IST
Maharashtra : జూన్ 10 లోపు ఎన్‌సీపీలో మరో కీలక పరిణామం... సంచలన ఆరోపణలు చేసిన బీజేపీ నేత

సారాంశం

Maharashtra: మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తంగా మారుతున్నాయి.  శివసేన (UBT) ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) ఎన్‌సీపీతో చేతులు కలుపబోతున్నారని బీజేపీ నేత నితీష్ రాణె (Nitish Rane) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Maharashtra: మహారాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధానంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో గందరగోళం నెలకొంది. NCP చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి శరద్ పవార్  సంచలనం స్రుష్టించారు. పలు కీలక పరిణామాల అనంతరం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు ప్రకటించారు. దీంతో ఆ వ్యవహారం సద్దుమణిగింది. ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితుల మధ్య ఎన్‌సీపీలో చోటుచేసుకోనున్న పరిణామాలపై బీజేపీ నేత నితీష్ రాణె (Nitish Rane) సంచలన వ్యాఖ్యలు  చేశారు. 
 
అజిత్ పవార్ పార్టీ(NCP)ని వీడారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో శివసేన (UBT) ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) ఎన్‌సీపీతో చేతులు కలుపబోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సంజయ్ రౌత్ జూన్ 10 లోపు ఎన్‌సిపితో చేతులు కలుపుతారని బిజెపి నాయకుడు నితీష్ రాణే షాకింగ్ ప్రకటన చేశారు. ఈ మేరకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. అయితే.. ఆయన శరద్ పవార్ పార్టీలోకి చేరేందుకు కొన్ని షరతులు విధించారని పేర్కొన్నారు. 

అదే సమయంలో సంజయ్ రౌత్‌పై విరుచుకుపడుతూ అజిత్ పవార్ NCP నుండి వైదొలగాలని తాను (రౌత్) ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.సంజయ్ రౌత్.. ఉద్ధవ్, రాజ్ ఠాక్రే మధ్య విభేదాలు సృష్టించారని నితేష్ రాణే ఆరోపించారు. ఉద్ధవ్ థాకరే తనను మరోసారి ఎంపీని చేసే స్థితిలో లేరనే భయం రౌత్‌కు పట్టుకుందని, ఆ విషయాన్ని ఎన్‌సీపీ నేతల దృష్టికి రౌత్ తెచ్చారని రాణే సంచలన ఆరోపణలు చేశారు.

రాబోయే రోజుల్లో సంజయ్ రౌత్.. NCP వేదికపై కనిపిస్తాడని తెలిపారు. శరద్ పవార్ రాజీనామా చేయగానే  దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష నాయకులందరూ ఉద్ధవ్ థాకరే కి ఫోన్ చేసారు.  అయితే ఉద్ధవ్ థాకరే తనకు ఎటువంటి కాల్ రాలేదని పేర్కొన్నారు. ఉద్ధవ్ ఠాక్రే రాజకీయాలకు ముగింపు పలకలని సంజయ్ రౌత్ ప్రయత్నిస్తున్నారనీ, అందుకే ..ఉద్ధవే , రాజ్ ఠాక్రేల మధ్య విభేదాలను సృష్టించారని సంచలన ఆరోపణలు చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్